Jiahkhan: జియాఖాన్ మృతి కేసులో లాంటి తీర్పు.. అసలేం జరిగిందంటే?

Jiahkhan: ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జియాఖాన్ 2013 వ సంవత్సరంలో మరణించారు.అయితే ఈమెది సహజ మరణం కాదని తనపై హత్య చేశారు అంటూ మరొక నటుడు సూరజ్ పంచోలి పై జియా ఖాన్ తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. దీంతో తన కూతురు మరణం పట్ల తణుకు న్యాయం జరగాలని ఆమె తల్లి వేడుకోవడంతో ఈ కేసును సిబిఐ కి అప్పగించారు. దాదాపు పది సంవత్సరాల సిబిఐ విచారణ తర్వాత కోర్టు ఈమె మృతి కేసు విషయంలో సంచలన తీర్పు వెల్లడించింది.

ఇంగ్లీష్‌-అమెరిక‌న్ న‌టిగా న‌ఫిసా రిజ్విఖాన్ అలియాస్ జియాఖాన్ పేరు తెచ్చుకున్నారు. ఈమె న్యూయార్క్‌లో పుట్టి పెరిగారు. బాలీవుడ్‌లోఈమె నటించినది కేవలం మూడు సినిమాలు మాత్రమే అయితే ఈ సినిమాలు తనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చాయి. 2012 వ సెప్టెంబర్‌ నుంచి జియాఖాన్ , సూర‌జ్ రిలేషన్‌లో ఉన్నారు. 2013, జూన్ 3న ముంబైలో మరణించారు. ఈమె మరణానికి తన ప్రియుడే కారణమని నటి తల్లి ఫిర్యాదు చేశారు.

 

ఇలా తన కూతురిని సూరజ్ ఎంతగానో హింసించారని తన వల్లే తన కుమార్తె చనిపోయింది అంటూ ఆరోపణలు చేస్తూ సీబీఐ ద‌ర్యాప్తు కోరుతూ ఆమె న్యాయ‌పోరాటం చేశారు. చివ‌రికి సీబీఐ ద‌ర్యాప్తు చేయాల‌ని ముంబై హైకోర్టు ఆదేశించింది. 2014లో సీబీఐకి అప్పగించింది. ఇలా 2014 వ సంవత్సరం నుంచి సిబిఐ అధికారులు ఈ కేసును విచారణ చేపడుతున్నారు అయితే నేడు చివరిగా ఈ కేసు విషయంలో కోర్టు తీర్పును వెల్లడించింది.

 

నటి జియాఖాన్ మరణానికి కారణం సూరజ్ పంచోలి కారణం అనడానికి సరైన సాక్షాధారాలు లేకపోవడంతో ఈ కేసు పై కోర్టు తీర్పును ప్రకటిస్తూ సూరజ్ ను నిర్దోషి అంటూ ఈ కేసును కొట్టివేశారు. ఇలా 10 సంవత్సరాల తర్వాత నటి హత్య కేసులో ఈయనకు ఉపశమనం లభించింది. కానీ జియా ఖాన్ మరణానికి గల కారణాలు ఏంటి అనేది మరోసారి సందిగ్ధంలో పడింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -