Uttar Pradesh: ఆ భిక్షగాడు ఐటీ రిటర్స్‌ చెల్లించేవాడంట..

Uttar Pradesh: ఫుట్‌పాత్‌లు, గుడి, మసీదు రోడ్ల పక్కనే కూర్చుని డబ్బులు అడిగే వారిని చూస్తే అయ్యే పాపం అని చాలా మంది ఎంతోకొంత దానం చేస్తారు. వారి ముఖం చేసి తిండి తినక ఎన్ని రోజులైందోనని మరి కొందరు భోజనం తీసుక్చొ పెడుతుంటారు. ఇలా అడుక్కునే వారిలో వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో పాటు యవ్వనస్తులు కూడా ఉంటారు.అయితే.. కొందరు పని చేయడానికి శక్తి, ఎలాంటి అంగవైకల్యం లేకున్నా కూడా ఇలా రోడ్లు, సిగ్నళ్ల దగ్గర అడుక్కుంటుంటారు. ఎవరైన ఏదైనా పని చేసుకోవచ్చుగా అని చెప్పినా వారు మాత్రం వారి పనిని వదులుకోరు. నిజంగా వీరికి తిండ లేకనో.. డబ్బులు లేక బిక్షాటన చేస్తున్నారంటే అదికూడా కాదు.. కొందరు ఆర్థికంగా బాగానే ఉన్నా కూడా భిక్షాటనను వదులు కోరు అలా భిక్షాటన చేసి రూ. లక్షల్లో వెనకేసుకుంటున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులో కి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన ఓ భిక్షగాడి ఖాతాలో దాదాపు రూ.70 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ధీరజ్‌ అన్యే వ్యక్తి స్థానికంగా ఉన్న కుష్టు వ్యాధి ఆస్పత్రిలో స్వీపర్‌గా పని చేస్తూ భిక్షాటన చేసేవాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగం ధీరజ్‌కు వచ్చింది. తల్లితో కలిసి ఉంటున్న ధీరజ్, ఆమెకు వచ్చే పెన్షన్‌ డబ్బులు, తాను భిక్షాటన చేస్తూ సంపాందించిన మొత్తంతో కాలం వెళ్లదీసేవాడు.

స్వీపర్‌ ఉద్యోగానికి వచ్చే డబ్బులను బ్యాంకు ఖాతాలోనే ఉంచేవాడు. పదేళ్లుగా అకౌంట్‌ నుంచి ఒక్క రూపాయి తీయలేదు. అలా ఇప్పుడు అతడి అకౌంట్‌లో రూ.70 లక్షలు ఉన్నాయి.ఇంకో ముక్కున వేలేసుకునే మాటేమిటంటే ధీరజ్‌ ప్రతి ఏడాది ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసేవాడు. క్షయ వ్యాధితో బాధపడుతూ ఆదివారం ధీరజ్‌ కన్ను మూశాడు. అనారోగ్యంతో ఉన్నప్పడు కూడా ధీరజ్‌ తన ఖాతా లోంచి ఒక్క రూపాయి కూడా తీయలేదు. వైరల్‌ అయిన ఈ వార్త చదివిన నెటిజన్లు ఇదేం బుద్ధి వేరే వాళ్లకు పెట్టలేదు తన కోసమైనా ఖర్చు పెట్టుకోలేదు. అంత డబ్బు ఉండి ఏం లాభం ఎవరు తింటారు అని కామెంట్ల రూపంలో తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

తండ్రి బాటలోనే..

ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ధీరజ్‌ తండ్రి కూడా ఇలానే చేసేవాడట. తన జీతం డబ్బును వాడకుండా రోడ్డుపై భిక్షాటన చేసుకుంటూ జీవించేవాడు. అదే అలవాటు ధీరజ్‌కు వచ్చింది. భిక్షాటన చేయగా వచ్చిన డబ్బు, 80 ఏళ్ల తన తల్లికి వచ్చిన పెన్షన్‌ డబ్బులతో ఇద్దరు కాలం గడిపేవారు. ప్రతి నెలా వచ్చిన జీతం డబ్బును అకౌంట్‌ నుంచి డ్రా చేయకపోవడంతో అవి లక్షలుగా మారాయి. ఆ డబ్బు గురించి కొన్ని నెలల కిందట ఐటీ అధికారులు ధీరజ్‌ని ప్రశ్నించగా అతడు చెప్పిన సమాధానంతో వారు వదిలేశారు. అప్పుడు కూడా ధీరజ్‌ వార్తల్లోకి ఎక్కాడు. ఇందులో మరో ట్విస్ట్‌ ఏంటంటే తాను పెళ్లి చేసుకుంటే వచ్చే మహిళ తన దగ్గర ఉన్న డబ్బుతో పారిపోతుందేమో అని భయపడ్డ ధీరజ్‌ పెళ్లి వద్దనుకున్నాడంట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -