Baby Trailer: కన్నీళ్లు తెప్పించే ప్రేమకథ.. హృదయానికి హత్తుకునేలా ఉందంటూ?

Baby Trailer: సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం బేబీ ఈ సినిమా జూలై 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది.

మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి వుంటుంది’ బేబీ ట్రైలర్ ఆరంభంలో రాసిన కొటేషన్ ఇది. ఇందుకు అనుగుణంగానే ఈ ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారని చెప్పాలి.ట్రైలర్ చూస్తుంటే స్కూల్ ఏజ్ లోనే హీరో హీరోయిన్ ప్రేమలో పడ్డారు. అయితే హీరో పదో తరగతి ఫెయిల్ అయి ఆటో నడుపుతూ ఉండగా హీరోయిన్ మాత్రం పై చదువులకు కాలేజ్ కి వెళుతుంది.

 

ఈ విధంగా కాలేజ్ వెళ్లినటువంటి ఆమె అక్కడ ఫ్రెండ్స్ కల్చర్ కి అలవాటు పడటం హీరోకి తన ప్రేమ పైన అనుమానాలు రావడం సన్నివేశాలను చూపించారు అయితే వీరి ప్రేమ కథ ఎలా మలుపు తిరిగిందన్నదే ఈ సినిమా. ఈ సినిమాలో చాలా పాపులరైన ‘ఓ రెండు ప్రేమ మేఘలై’ పాట ట్రైలర్ ఆర్ఆర్ లో వాడటం బావుంది.ఈ ట్రైలర్ చివరిలో అమ్మాయి మాట్లాడుతూ మాకు మీ అంత బలం లేకపోవచ్చు కానీ గుండెల మీద కొట్టాడంటే మాకన్నా బలంగా ఎవ్వరు కొట్టలేరు అన్న డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -