Sharad Pawar: దేశంలో థర్డ్ ఫ్రంట్.. మోదీకి వ్యతిరేకంగా కొత్త కూటమి?

Sharad Pawar: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటినుంచే ఎన్డీయేను అధికారం లోనుంచి దించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మోదీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీల నేతలందరినీ కలిశారు. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారు. ఇక బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా తాను ఎన్డీయేకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటిని ఏకం చేస్తానని ప్రకటించారు.

అంతేకాదు నితీష్ కుమార్ ఆఫర్ కూడా ప్రకటించారు. ప్రతిపక్షాల కూటమి అధికారంలోకి వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చలు జరిపిన నితీష్ కుమార్.. మోదీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధి ఆయననే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తెరపైకి మరో సీనియర్ నేత వచ్చారు.

మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ తో కలిసి దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని శరద్ పవార్ ప్రకటించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్ తో కలిసి ఆయన పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్డీయేకు వ్యతిరేకంగా కలుస్తాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ తో కలిసేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సిద్దంగా ఉన్నారని శరద్ పవార్ తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో ఉన్న విబేధాలను పక్కనపెట్టి కలవాలని శరద్ పవార్ సూచించారు.

కాంగ్రెస్ తో ఉన్న వైరాన్ని పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని శరద్ పవార్ సూచించారు. కాంగ్రెస్, సీపీఎం కలిసి పోటీ చేయడం ద్వారా పశ్చిమబెంగా్ల లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయనిన, అందే మూడు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీకి అన్ని సీట్లు వచ్చేవ ికాదని మమత బెనర్జీ అభిప్రాయపడుతు్నారని తెలిపారు. ఇప్పుడు బీజేపీని ఓడించడమే తన కర్తవ్యమని ఆమె చెబుతున్నారని శరద్ పవార్ తెలిపారు. కాంగ్రెస తో కలిసేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు.

ఇక బీహార్ సీఎం నితీస్ కుమార్, జమ్మూకశ్మర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఇఫ్పటికే కాంగ్రె్ తో కలిసేందుకు సిద్దమ్యారు. ఇప్పుడు శరద్ పవార్, మమతా బెనర్జీ కూడా ముందుకు రావడంతో దేశంలో ఎన్టీయేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ కు ఏర్పాటు జరుగుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ కు ఎక్కువ ఎంపీ ీట్లు వస్తే ఆ పార్టీ తరపు ప్రధాని అిబ్యర్ధి ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రాంతీయ పార్టీల నుంచి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తే ప్రాంతీయ పార్టీల నుంచి ఒకరికి ప్రధాని పదవి ఇచ్చే విధంగా డీల్ కుదుర్చుకోనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -