Chittoor: బాయ్ ఫ్రెండ్ తో భర్తకు దొరికిపోయిన భార్య.. ఆపై?

Chittoor: ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలామంది మహిళలు తాళి కట్టిన భర్తను కాదని పరాయి మగాడే మోజులో పడి పచ్చని సంచారాలను చేజేతులా నాశనం చేసుకోవడంతో పాటు ఇంకొందరు మహిళలు మరింత బరితెగించి తాళి కట్టిన భర్తనే ప్రియుడితో కలిసి చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక మహిళ ప్రియుడితో కలిసి రాసలీలలు జరుపుతూ భర్తకు అడ్డంగా దొరికిపోయింది.

ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏపీ లోని చిత్తూరు జిల్లా గూడురు పరిధిలోని సొసైటీ ప్రాంతంలో శ్రావణి 30 ఏళ్ల వివాహిత నాగరాజు దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. కానీ గత ఏడాది నుంచి దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దాంతో 8 నెలల నుంచి ఈ భార్య భర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే శ్రావణికి గూడూరు రెండో పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

 

ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలోనే శ్రావణి చెన్నూరు లోని ఒక తోటలో కాపలాగా ఉంటూ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇదే విషయం భర్త నాగరాజు చెవిన పడడంతో కోపంతో ఊగిపోయాడు. ఆదివారం నాగరాజు భార్య శ్రావణికి ఫోన్ చేశాడు. నిన్ను చూడాలని ఉందంటూ ఆమె ఉంటున్న తోటలోకి వచ్చాడు. అక్కడికి రాగానే భార్య ప్రియుడు వెంకటేశ్వర్లతో కనిపించింది. ఈ సీన్ చూసిన నాగరాజు తట్టుకోలేపోయాడు. వెంటనే కత్తితో తన భార్య శ్రావణిపై అనేకసార్లు దాడి చేశాడు. అడ్డుకోబోయిన వెంకటేశ్వర్లుపై కూడా నాగరాజు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆ వివాహితను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -