Woman: ఫుడ్ అమ్మి లక్షల్లో సంపాదిస్తున్న మహిళ.. సంపాదన ఎంతంటే?

Woman: సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి బ్రతుకుతెరువు కోసం ఎన్నో ఉద్యోగాలు చేస్తూ ఎన్నో పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు.అయితే కొందరు ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక చిన్న వ్యాపారమైన సొంతంగా ఏర్పాటు చేసుకొని వారి వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఇక మరికొందరు చదువుకోనటువంటి వారు ఏదో ఒక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు.అయితే ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద రెస్టారెంట్లలోకి వెళ్లి భోజనం చేసే వారి సంఖ్య పూర్తిగా తగ్గింది అని చెప్పాలి.

బయట వీధులలోను లేదా ఏదైనా చెట్ల కింద ఇంటి నుంచి స్వయంగా తయారు చేసుకొచ్చిన భోజనాలను ఏర్పాటు చేసే వారి సంఖ్య అధికమైంది ఇలాంటి చోట రుచికరమైన ఆహారం తినడమే కాకుండా తక్కువ ధరలో కడుపునిండా తినే అవకాశం లభించడం వల్ల ఎంతోమంది ఇలాంటి చోట ఆహారం తినడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ పెద్దావిడ ఒకరి వద్ద పని చేయడం ఇష్టం లేక సొంతంగా ఇంటి నుంచి తన కోడలి సహాయంతో భోజనం తయారు చేసుకుని వచ్చి చెట్ల కింద కూర్చొని అమ్ముతున్నారు.

ఇలా తాను మొదలుపెట్టిన వ్యాపారం మొదట్లో సక్సెస్ కాలేదని దాదాపు 15 రోజులపాటు తీసుకువచ్చిన భోజనం అలాగే వెనక్కి తీసుకెళ్లే వాళ్ళమని తెలిపారు.అయితే ప్రస్తుతం తన వ్యాపారానికి భారీగా డిమాండ్ పెరిగిందని ఉదయం 11 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల వరకు తనకు వ్యాపారం జరుగుతూనే ఉంటుందని తెలియజేశారు. తనతోపాటు తన కోడలు మరో ముగ్గురు పనివాళ్లను పెట్టుకొని ఈ ముసలావిడ తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది.

ఇలా ఈ వ్యాపారం ద్వారా ప్రతిరోజు ఆమెకు 20వేల వరకు పెట్టుబడి వస్తుందని తనకు 5 వేల వరకు ఆదాయం తెలిపారు. ఇక ఈమె ప్రతిరోజు రైస్ తో పాటు వివిధ రకాల కర్రీ లను ఇక్కడ అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ భోజనం చేయడం మాత్రమే కాకుండా పార్సిల్ తీసుకెళ్లే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుందని తెలిపారు. ఇలా ఈమె ముసలావిడ భోజనం పెడుతూ నెలకు అన్ని ఖర్చులు పోను దాదాపు 60 వేల వరకు ఆదాయాన్ని అందుకుంటుందని ఈ లెక్కన సంవత్సరానికి ఆరు ఏడు లక్షల రూపాయలను సంపాదిస్తుందని తెలుస్తోంది ఇలా ఈ వయసులో ఈమె ఇంత కష్టపడుతూ ఎందరికో ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -