Witch: ఈ మంత్రగత్తె సంపాదన ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Witch: ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెంది ప్రతి ఒక్క విషయాన్ని వాస్తవంగా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే 100 మందిలో ఏ ఒక్కరో ఇలాంటి వాటిని నమ్మడం లేదు వారి కేవలం మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ధోరణిలోనే ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి వారు ఇప్పటికీ అక్కడక్కడ మనకు కనబడుతూనే ఉంటారు. వాస్తవాన్ని వదిలిపెట్టి మంత్రాలు చదివే వారిని నమ్ముతుంటారు.అయితే ఇలాంటి వారి బలహీనతలను క్యాష్ చేసుకున్నటువంటి ఒక బ్యూటీషియన్ ఏకంగా మంత్ర గత్తేగా మారిపోయి నెలకు లక్షల్లో సంపాదన రాబడుతుంది.

ఇంగ్లాండ్‌లోని లండన్‌కు చెందిన 29 ఏళ్ల జెస్సికా కాడ్‌వెల్‌ ఓ సెలూన్‌లో బ్యూటీషియన్‌గా పని చేస్తూ ఉండేది. 2019లో ఓ రోజు సోషల్‌ మీడియా వాడుతూ ఉండగా.. ఆమెకు ఒక పోస్ట్ కనిపించింది అందులో మానవాతీత శక్తుల గురించి చర్చించుకుంటూ ఉన్నారు.వారికి ఎదురైన చేదు సంఘటనల గురించి మాట్లాడుకోవడంతో ఈమెకు కూడా అలాంటి వాటి గురించి తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది.

 

ఇలా ఈమెకు క్షుద్ర విద్యలపై ఆసక్తి పెరగడంతో వెంటనే క్షుద్ర విద్యలకు సంబంధించిన పుస్తకాలను కొంది. వాటిని చదివి మంత్రగత్తెగా మారిపోయింది. టరోట్‌ కార్డులు, క్రిస్టల్‌తో తన దగ్గరికి వచ్చే వారి భవిష్యత్తు ఏంటో చెబుతోంది. తమ భార్యలు మనసులో వారి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం ఇతరులు తమను ఎలా ఆకర్షించాలి అనే విషయాలన్నింటిని కూడా ఈమె తెలియజేస్తున్నారు అయితే ఇలాంటి వాటిని చెప్పడానికి తాను ఎలాంటి పరికరాలు ఉపయోగించడం లేదని కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఇలాంటి విషయాలను తెలియచేస్తారని తెలిపారు.

 

తాను సెలూన్ లో పనిచేస్తున్న సమయంలో నా సంపాదన సరిపోక తమ కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడేవారు అయితే ప్రస్తుతం తను నెలకు 7 లక్షల వరకు సంపాదన రాబడుతున్నానని తన వద్ద 5000 మంది క్లైంట్స్ ఉన్నారు అంటూ ఈ సందర్భంగా
జెస్సికా తన సెలూన్ పనులను పక్కనపెట్టి పూర్తిగా మంత్రగత్తగా మారిపోయి ఇలా అందరి జాతకాలను చెబుతూ వార్తల్లో నిలిచారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -