Lifestyle: ఈ మహిళ కన్నీటి కష్టాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Lifestyle: జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలో ఇష్టమైన పరిస్థితిలను ఎదుర్కోవాల్సిందే. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ జీవితంలో కష్ట సుఖాలను అనుభవించిన తర్వాతే వారు ఒక మంచి పోజిషన్ కు వెళుతూ ఉంటారు. అలా జీవితంలో ప్రతి ఒక్కరు కూడా బాధలను సంతోషాలను కష్టాలను దుఃఖాలను ప్రతి ఒక్కటి అనుభవించాలి అప్పుడే జీవితం విలువ కష్టం విలువ దుఃఖం విలువ తెలుస్తుంది. అయితే మనం సమాజంలో చాలా మంది అనుకోకుండా ఏర్పడిన కష్ట పరిస్థితుల సమయంలో చాలామంది కుటుంబ సభ్యులు వెన్నంటే తోడుండి ధైర్యం చెప్పాల్సింది పోయి నడిరోడ్లో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు.

అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో కూడా ఒక మహిళ తన బాధను వ్యక్తపరుస్తూకన్నీరు పెట్టుకుంది. ఆ వీడియోలో మహిళ మాటలు వింటే ఎవరైనా కన్నీరు పెట్టాల్సిందే. ఆ వీడియోలో ఆ మహిళ మాట్లాడుతూ.. నేను గర్భవతిగా ఉన్న సమయంలో నేను నా పుట్టింటికి డెలివరీ కోసం వెళ్లాను ఆ సమయంలో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగి నా వెన్నముక విరిగిపోయింది. ఆ సమయంలో నా వెన్నంటే ఉండి నాకు ధైర్యం చెప్పాల్సిన నా భర్త నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. నేను వైవాహిక జీవితానికి పనికిరాని అనేసి నన్ను వదిలి వెళ్లిపోయాడు. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఆ పనికి పనికిరాని అన్న ఒకే ఒక కారణంతో నా భర్త నన్ను వదిలేసి వెళ్లిపోయాడు.

 

ఆ సమయంలో పుట్టింటి వారు అండగా ఉన్నారు కానీ మాకు ఉండడానికి సొంతంగా ఇల్లు కూడా లేదు. నాకు యాక్సిడెంట్ కాకముందు మ్యారేజ్ కి ముందు నేను ఒక టీచర్ గా పని చేసేదాన్ని. కానీ యాక్సిడెంట్ తర్వాత నా జీవితం మారిపోయింది.. ఆ సమయంలో నన్ను మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న నన్ను ఎంతో బాగా చూసుకోవడంతో పాటు ప్రోత్సహించారు. ఈరోజు ఇలా బతికే ఉన్నాను అంటే అందుకు గల కారణం ఆయనే ఆ విషయం చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను అని ఆ మహిళ తెలిపింది. ఆ సమయంలో సర్జరీ కోసం ఉన్న డబ్బులు అన్ని పెట్టేసి ఒకానొక సమయంలో కనీసం ఒక్క పూట తిండి లేకుండా ఉన్న పరిస్థితులు కూడా మేము ఎదుర్కొన్నాము అంటూ కన్నీళ్లు పెట్టుకొంది. దేవుడు నా జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోమని ఆ సమయం నుంచి నాకు పరీక్ష పెడుతూనే ఉన్నాడు. నేను ఒంటరిగానే పోరాడుతూ ఈరోజు సక్సెస్ అయ్యాను అని ఆమె తెలిపింది. నాకు కొడుకు ఉన్నాడు వాడి కోసమే నేను ఇంకా బతికే ఉన్నాను. వాడు లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని. వాడి కోసమే నేను బతుకుతున్నాను అంటూ సదరు మహిళల కన్నీళ్లు పెట్టుకుంది. కేవలం వెన్నుపూస విరిగిపోయింది అన్న ఒకే ఒక కారణంతో సంసార జీవితానికి పనికిరాదు అని ఆ మహిళను తన భర్త వదిలేసి వెళ్ళిపోయాడు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -