Telangana: మహిళ విషయంలో దారుణంగా ప్రవర్తించిన ఎస్సై.. ఆ తర్వాత?

Telangana: తాజాగా షేక్‌ ఫర్హా అనే 22 ఏళ్ళ ముస్లిం యువతి తన తల్లితో కలిసి సిద్దిపేట నుంచి జగిత్యాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. అదే బస్సులో జగిత్యాల ఎస్ఐ భార్య ఎక్కి వీరు కూర్చున్న సీట్లోనే కూర్చోవడం జరిగింది. అయితే కాసేపటి తరువాత సీటు విషయం లో వీరిమధ్య వివాదం జరిగింది. ఇంకేముంది తన భర్త ఎస్ఐ అని ఈ గొడవ గురించి అతడికి చెప్పానని కాసేపట్లో వచ్చి మీ సంగతి చెప్తాడని ఫర్హాని ఆమె తల్లిని బెదిరించింది సదరు ఎస్ఐ భార్య. కాసేపటికి చెప్పినట్లుగానే సదరు ఎస్ఐ సినిమా స్టైల్లో బస్‌ను చేజ్‌ చేసి లోపలకి ఎంటరయ్యాడు. నా భార్యతో గొడవపడతావా? అంటూ యువతిపై దాడి చేశాడు.

అసభ్య పదజాలంతో దూషించడమే మాత్రమే కాకుండా ఫర్హా, ఆమె తల్లిని బెదిరించాడు. దీంతో భయపడిన ఫర్హా తన ఫోన్‌లో వీడియో చాట్‌ ఆన్‌ చేసి ఫ్రెండ్‌కి నంబర్‌ పంపింది. రికార్డు చేస్తున్నట్లు తెలుసుకున్న ఎస్ఐ ఆమె ఫోనెర్ లాక్కోవడమే కాకుండా, జుట్టుపట్టి మరీ బస్సు నుంచి బయటికి లాక్కొచ్చి కొట్టాడు. బూటు కాళ్లతో తన్నాడు. మహిళా అని చూడకుండా ఎస్ఐ పదవిలో ఉన్న అనిల్ అందరూ చూస్తుండగానే బూటు కాలితో తన్నాడు. అనీల్ భార్య ఆ అమ్మాయి తల్లి మీద చేయిచేసుకుంది. అక్కడ అంతమంది జనాలు ఉన్నా వారంతా చూస్తున్నారే కానీ ఎవరు అనీల్ ని ఆపే సాహసం చేయలేదు. చివరికి ఒక మహిళ ధైర్యం చేసి అతనిని నిలదీసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

 

అయితే బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా బాధితులు రాత్రి 12 గంటలకు వరకు పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు కాచింది. ఈ దాడిపై బాధితురాలు జగిత్యాల టౌన్1 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె పోలీస్ స్టేషన్ ముందట స్పందిస్తూ రోదించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్ని జరిగాక పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నారు. అతన్ని సస్పెండ్ చేస్తూ ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అతనిపై 290, 323, 340 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ సెక్లన్ల వల్ల సదరు ఎస్సైకి ఎంత శిక్ష పడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవటం ఖాయం. 1000 రూపాయల జరిమానా లేదంటే నెలలోపు జైలు శిక్ష. ఈ శిక్షలపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఓ యువతి పట్ల అంత అమర్యాదగా ప్రవర్తించిన అతనికి ఇంత చిన్న చిన్న సెక్షన్లతో కేసులా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కొరకు తవ్వకాలు.. ఈ ఆరోపణలపై వైసీపీ స్పందిస్తుందా?

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ దొంగలించారు. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలను ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే టీటీడీ అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ప్రభుత్వంపై చేసిన...
- Advertisement -
- Advertisement -