Jangoan: పెళ్లయిన 10 రోజులకే అలాంటి పని చేసిన యువతి?

Jangoan: ఇటీవల కాలంలో చాలామంది ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న కొన్ని జంటలు కొద్ది రోజులు కూడా కలిసి ఉండకముందే కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇంకొందరు మనస్పర్ధలు కారణంగా ఒకరినొకరు చంపుకోవడం లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. తాజాగా అటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. అసలేం జరిగిందంటే జనగాం జిల్లా బీబీపెటకు చెందిన వరప్రసాద్ అనే 24 ఏళ్ళ యువకుడు స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా ఇతడిని ఇష్టపడింది.

దీంతో ఇద్దరూ ప్రేమలో తేలారు. అలా వీరి ప్రేమాయణ కొన్నాళ్ల పాటు నడిచింది. ఇక ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇద్దరివి కులాలు వేరుకావడంతో పెద్దలు ఒప్పుకోరని అనుకున్నారు. ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇందులో భాగంగానే ఇటీవల ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఈ ప్రేమికులు స్థానిక పోలీసులకు ఆశ్రయించి రక్షణ కల్పించమని కోరారు.పోలీసులు ఇద్దరి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి కౌన్స్ లింగ్ ఇచ్చారు. యువతి తల్లిదండ్రులు సైతం10 రోజుల తర్వాత ఇద్దరికి పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు.

 

కట్ చేస్తే10 రోజుల తర్వాత యువతి వర ప్రసాద్ కు ఫోన్ చేసి, ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది అని చెప్పడంతో వర ప్రసాద్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక్కసారిగా మాట మార్చడంతో ఆ యువకుడు తట్టుకోలేక మార్చి 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే వెంటనే గమనించిన కుటుంబసభ్యులు వర ప్రసాద్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ యువకుడు చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు విడిచాడు. అతడు మరణించడంతో వర ప్రసాద్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

 

వారి కుమారుడి చావుకి స్థానిక ఎస్ ఐ కారణమని, పెళ్లి చేసుకుని స్టేషన్ కు వెళ్తే.. పోలీసులు అమ్మాయి తరుఫున మాట్లాడారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించి ఆస్పత్రి ముందు బైటాయించారు. అనంతరం ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -