Gujarat Elections: ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు దెబ్బకొట్టేందుకు రెడీ అయిన ఆఫ్

Gujarat Elections: కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఆప్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని బయటపెడుతూ కేజ్రీవాల్ చేసిన పోరాటం అంతా ఇంతా కాదు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడి బీజేపీలోకి అధికారంలోకి రావడానికి కేజ్రీవాల్ ఎంతోకోంత సహయం చేశారు. 2014 ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ కాంగ్రెస్ కు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశారు. కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలను బయటపెట్టారు. దీంతో అప్పటికే కాచుకుని కూర్చోని ఉన్న బీజేపీ బలపడటానికి కాంగ్రెస్ పతనమే ఉపయోపగడింది.

పరోక్షంగా కేజ్రీవాల్ వల్లనే దేశంలో కాంగ్రెస్ బలహీనపడటం వల్ల బీజేపీ బలపడింనే టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే కాంగ్రెస్ ఎక్కడైతే బలంగా ఉందో, ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడే ఆప్ దృష్టి పెడుతోంది. అక్కడ కాంగ్రెస్ ను బలహీనపరచ్చి ఆప్ అధికారంలోకి వస్తుంది. ఢిల్లీలో కూడా గతంలో కాంగ్రెస్ బలంగా ఉండేది. అక్కడ ఆప్ ఎంట్రీతో కాంగ్రెస్ బలహీనపడిపోయింది. వరుసగా రెండుసార్లు ఢి్ల్లీలో సీఎంగా కేజ్రీవాల్ గెలిచారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ పై ఆప్ దృష్టి పెట్టింది.

పంజాబ్ లో కూడా కాంగ్రెస్ ను ఓడించి ఆప్ అధికారంలోకి వచ్చింది. పంజాబ్ లో గెలుపుపై కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ 117 సీట్లు ఉన్న పంజాబ్ లో ఆప్ ఏకంగా 95 సీట్లు గెలిచి అధికారాన్ని సంపాదించుకుంది. ఢిల్లీ, పంజాబ్ ఊపుతో ఇక అన్ని రాష్ట్రాలపై ఆప్ దృష్టి పెట్టింది. అన్ని రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటుంది. అన్ని రాష్ట్రాల్లోనే బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

పంజాబ్ తర్వాత ఇప్పుడు గుజరాత్ ఎన్నికలపై ఆప్ ఫోకస్ పెట్టింది. గుజరాత్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పోరాడి ఓడింది. కాంగ్రెస్ గెలుపు ఆచుల్లోకి చేరుకుని ఓడిపోయింది. గుజరాత్ లో ఇఫ్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. అయితే ఇప్పుడు ఆప్ ఎంట్రీతో గుజరాత్ లో కూడా కాంగ్రెస్ పతనం కావడం ఖాయమంగా కనిపిస్తోంది. గుజరాత్ లో వరుసగా గెలుస్తూ వస్తున్న బీజేపీపై వ్యతిరేకత రోజురోజుకకు పెరుగుతోంది. ఇక కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలహీనపడిపోయింది. అలాగే గుజరాత్ లో కూడా కాంగ్రెస్ నాయకత్వ లేమితో బాధపడుతుంది. హర్దిక్ పటేల్ బీజేపీలో చేరడంలో అక్కడ కాంగ్రెస్ కకు షాక్ తగింది.

దీంతో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ ఓటర్లను తమవైపుకు తిప్పుకుంటోది. డిసెంబర్ లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆప్ మరింత స్పీడ్ పెంచింది. తొలుత హర్దిక్ పటేల్ ను తమ పార్టీ చేర్చుకోవాలని ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. గుజరాత్ ఆప్ నేతలు బహిరంగంగా తమ పార్టీలో చేరాల్సిందిగా హర్దిక్ పటేల్ ను ఆహ్వానించారు. కానీ హర్దిక్ పటేల్ బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ ను బలహీనపర్చడం ద్వారా తాము బలపడొచ్చే ఆలోచనతో ఆప్ ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది.

గత 15 ఏళ్లుగా గుజరాత్ లో ఆప్ అధికారం లేదు. దీంతో కాంగ్రెస్ లోని నేతలకు కూడా కాంగ్రెస్ పై నమ్మకం పోయింది. బీజేపీపై వ్యతిరేకత, కాంగ్రెస్ పై నమ్మకం కోల్పోవడం తమకు కలిసొస్తుందని ఆప్ భావిస్తుంది. దీంతో ఆప్ రూపంలో గుజరాత్ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ కు ఎక్కువ నష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -