Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కు తిరుగులేదట.. ఆ సర్వేలలో చెబుతున్న కీలక విషయాలు ఇవే!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు? అనే అంశంపై ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏ పార్టీ అధినేత గురించి అయినా ఆ మాత్రం ఉత్కంఠ ఉంటుంది. చంద్రబాబు కుప్పం నుంచి, జగన్ పులివెందుల నుంచి పోటీ చేస్తారు. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. ఉత్కంఠ ఉండదు. వారి పేర్లు ప్రకటించకపోయినా.. అవి ఫిక్స్ అయిన స్థానాలు. టీడీపీ ఫస్ట్ లిస్ట్‌లో నారా లోకేష్ పేరు ఉంది. ఇటీవల బీజేపీ జాతీయ స్థాయిలో విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్‌లో మోడీ పేరు ఉంది. కానీ.. జనసేన ఫస్ట్ లిస్టులో పవన్ పేరు లేదు. దీంతో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. వైసీపీ కూడా పవన్ కు ఇంకా క్లారిటీ లేదని సెటైర్లు వేసింది. అటు.. పవన్ పోటీపై గత కొంతకాలంగా చాలా పుకార్లు షికారు చేస్తున్నాయి. గాజువాక నుంచి అని కొన్ని రోజులు, భీమవరం నుంచి అని మరికొన్ని రోజులు.. ఆ తర్వాత కాకినాడ నుంచి కూడా పోటీ చేస్తారని కొంతమంది ప్రచారం చేశారు. కాకినాడలో పవన్ ఓ ఇల్లు కూడా తీసుకున్నారని.. గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారని పుకార్లు వచ్చాయి. జగసేన మొదటి లిస్ట్ విడుదల చేసిన తర్వాత.. ఆ లిస్టులో పవన్ పేరు లేకపోయినా.. భీమవరం నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టు పవన్.. భీమవరంలోని టీడీపీ నేతలను కలిశారు. మంతనాలు జరిపారు. అటు, జనసేన కార్యకర్తలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో.. పవన్ భీమవరం నుంచి పోటీ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే, ఆ వార్తలకు చెక్ పెడుతూ ఇప్పుడు మరో వార్త జోరుగా నడుస్తోంది. జనసేన అధినేత పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. జనసేన అంతర్గత వర్గాల్లో ఈ చర్చ బాగా నడుస్తోంది. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తే ఎలా ఉంటుందని రెండు సర్వేలు కూడా ఫిబ్రవరిలో చేయించారని ఓ టాక్. పవన్ పోటీ చేస్తే గెలుపు ఖాయమని ఈ సర్వేల్లో తేలిందట. పిఠాపురంలో రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో అరవై వేల మంది కాపులే ఉన్నారు. వీరంతా మూకుమ్మడిగా పవన్ కు ఓటు వేస్తారని అంచనా. మహా మిస్ అయితే ఐదువేలు ఓట్లు పడకపోవచ్చు కానీ.. 55 వేల మంది గ్లాసు గుర్తుకే ఓటు వేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. యూత్ కూడా అక్కడ ఎక్కువగానే ఉన్నారు. యువత కూడా వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండటంతో పాటు జనసేన వైపు మోజుగా ఉన్నారు. ఇక టీడీపీ మద్దతు దారులు పొత్తులో భాగంగా జనసేనకు వేస్తారు. పిఠాపురంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. జగన్ బీసీలకు పదవులు ఇచ్చి పవర్స తీసేశారని ప్రతిపక్షాలు జనంలోకి బలంగా తీసుకెళ్లారు. దీంతో.. బీసీలు కూడా వైసీపీపై అసంతృప్తిగా ఉన్న అంటే.. పిఠాపురంలో కూడా పవన్ పోటీ చేస్తే గెలుపు ఖాయంగా తెలుస్తోంది. దీంతో వవన్ చూపు పిఠాపురం వైపు పడినట్టు జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పవన్ పిఠాపురం వైపు మరో కారణం కూడా ఉందని అంటున్నారు. ఈసారి భీమవరంలో జనసేన ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో పవన్ 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ, మూడో స్థానంలో ఉన్న టీడీపీ 54 వేల ఓట్లు సాధించింది. ఈసారి టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి కనుక.. టీడీపీ ఓట్లు కూడా జనసేనకే పడతాయి. దీంతో.. గెలుపు సునాయాసంగా ఉంటుంది. పైగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసొస్తుంది. కాబట్టి ఈజీగా గెలిచే స్థానాన్ని జనసేనలో వేరే అభ్యర్థికి కేటాయించి పిఠాపురంలో పోటీ చేస్తే బాగుటుందని పవన్ ఆలోచనగా తెలుస్తోంది. పిఠాపురంలో కూడా పవన్ కు పవనాలు అనుకూలంగానే ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -