Ram Charan: ఆ సెంటిమెంట్ ప్రకారం రామ్ చరణ్ కు భారీ షాక్ తగలడం ఖాయమా?

Ram Charan: తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొద్దిరోజులుగా రామ్ చరణ్ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. దాని అందుకు గల కారణం కూడా లేకపోలేదు. రామ్ చరణ్ ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తాజాగా రామ్ చరణ్ కూతురికి పేరు కూడా పెట్టారు. ఇక రామ్ చరణ్ కూతురు పుట్టినప్పటినుంచి హంగామా మామూలుగా లేదు.. ఈ లిటిల్ ప్రిన్సెస్ కి సంబంధించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.

చెర్రీ కూతురికి క్లీంకార అనే పేరును కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ తర్వాత సినిమాపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే చరణ్ మరో సినిమా కమిట్ అయ్యాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంద‌ని తెలుస్తోంది. అయితే త్వరలోనే షూటింగ్ మొదల‌వుతున్న ఆ సినిమా ఒకవేళ ప్లాప్‌ అయితే చరణ్ కి భారీ దెబ్బ పడుతుంది అంటున్నారు నెటిజన్లు.

 

రామ్ చరణ్ ఎప్పటికే రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో మగధీర, త్రిబుల్ ఆర్ సినిమాల్లో నటించారు. రాజమౌళితో సినిమా చేసిన‌ తర్వాత ఏ హీరో కైనా భారీ డిజాస్టర్ తప్పదు. ఈ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అయితే రామ్ చరణ్, శంకర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం ఖాయం. ఆ తర్వాత బుచ్చిబాబు సనాతో చేసే రామ్ చరణ్ సినిమా కూడా బోల్తా కొట్టింది అంటే పాన్ ఇండియా హీరో కాస్త డిజాస్టర్ హీరోగా మారే ప్ర‌మాదం ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో బుచ్చిబాబు సనాతో రామ్ చరణ్ చేసే కథను ముందుగా అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత బుచ్చిబాబు రామ్ చరణ్‌కు ఆ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఏదేమైనా బుచ్చిబాబు సినిమా ఒక వేళ ప్లాప్ అయినా అయితే అప్పుడు ఎన్టీఆర్, బ‌న్నీ జ‌డ్జ్‌మెంట్ క‌రెక్ట్ అవుతుంద‌ని ఒక‌వేళ హిట్ కొడితే చెర్రీ డెసిష‌నే రైట్ అవుతుంద‌ని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. మరి రాంచరణ్ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి మరి లేదో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -