Chandrababu Naidu: పేదలకు 3 సెంట్ల స్థలం + ఇల్లు.. చంద్రబాబు నిజంగా దానవీర శూర కర్ణుడేగా?

Chandrababu Naidu:  ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ అనేక హామీలను ప్రకటించారుచంద్రబాబు. ఇప్పటికే సూపర్ సిక్స్ వంటి పథకాలను ప్రకటించిన టీడీపీ ఇప్పుడు తాజాగా తాము అధికారంలోకి రాగానే పేదలకు రెండు సెంట్లు నుంచి మూడు సెంట్లు భూమి ఇస్తామని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా స్థలంలో పునాదుల నుంచి రూఫ్ వరకు ప్రభుత్వమే కట్టి ఇస్తుందని ప్రకటించడం గమనార్హం. అంతేకాకుండా ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ వస్తూ వస్తూనే విధ్వంసం సృష్టించాడని ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి మొత్తం అన్నింటినీ ధ్వంసం చేసేసాడని తన ఆవేదన వ్యక్తం చేశారు. సైకో జగన్ ఇచ్చిన బాత్రూం లాంటి స్థలంలో పడుకోవటానికి కూడా చోటు సరిపోవటం లేదని కొందరు స్త్రీలు తమ వద్ద ఆవేదన వెళ్ళగక్కారనీ, అందుకే కొందరు ప్రజలు తమకి స్థలం కావాలని కోరుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు .

ఇప్పటికే తాము ప్రకటించిన సూపర్ సిక్స్ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పిన చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నుంచి మూడు సెంట్లు భూమిని ఇస్తామని ప్రకటించారు. ఈ సభలో కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా జనసేన నాయకుడు ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ తెదేపా నుంచి పోటీ చేస్తున్నారు. వీరిద్దరిని చంద్రబాబు చెరో వైపునా నిలబెట్టుకొని తన ప్రసంగాన్ని కొనసాగించారు.

విద్యార్థులకి గంజాయి అలవాటు చేసి వారిని నేరస్తులుగా చేస్తున్నారు, కనిపించిన భూమిని అంతా కబ్జా చేస్తున్నారు, రేపటి రోజున ఇలాంటి వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోమన్నారు చంద్రబాబు. జగన్ కి అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయి, ఆయనే నాయకుడిగా శాశ్వతం అనుకుంటున్నాడు, అలాంటి వాడి అహంకారం దించాలంటే మీరు ఓటుతోనే సమాధానం చెప్పాలి అంటూ ప్రజలని ఉత్తేజపరిచారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -