Vijay Devarakonda: లైగర్ కు రెమ్యునరేషన్ త్యాగం చేసిన కొండన్న?

Vijay Devarakonda: తెలుగు ఇండస్ట్రీలోని యువ నటులలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటన శైలి అద్భుతం అనే చెప్పాలి. ఇండస్ట్రీలో చాలా తక్కువ కాలంలోనే స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ మంచి హిట్ చిత్రాలను చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాను పూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు.

అయితే ఈ సినిమా నిర్మాణ క్రమంలో చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు పూరి. విజయ్ దేవరకొండ కు తన పారితోషకాన్ని పూరి తన ఇంటికి పంపినప్పుడు, తను సినిమా పూర్తి అయిన తర్వాతే నా పారితోషకాన్ని తీసుకుంటానని పూరికి చెప్పారట. అందుకే కొద్దిపాటి నామమాత్రపు పారితోషకాన్ని తీసుకొని సినిమా లాభాల్లో వాటా తీసుకుంటానని ఒప్పుకున్నారట విజయ్ దేవరకొండ. విజయ్ ఏ సినిమాలో కూడా లాభాల్లో వాటా తీసుకుంటానని ఒప్పుకున్నది లేదు. కానీ ఈ సినిమాపై నమ్మకంతో, ఆయన ఈ పని చేశారు.

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఇప్పటివరకు అందిన పారితోషకం ఏడు కోట్లు మాత్రమే. తన పారితోషకాన్ని త్యాగం చేసిన విజయ్ కి ఈ సినిమా మంచి హిట్ అయితే 15 నుంచి 20 కోట్లు వచ్చే అవకాశం ఉంది. దర్శకత్వం వహిస్తున్న పూరి జగన్నాథ్ కూడా సినిమా లాభాల్లో వాటా తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దానితో నిర్మాతలకు రావలసిన మొత్తం వచ్చేసిందని అనుకోవచ్చు. తరువాత వచ్చే డబ్బు అంతా కూడా లాభమే అని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ తర్వాతి సినిమాకు 15 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల అంచనా.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -