Vijay Deverakonda: విజయ్ దేవరకొండ అతి తగ్గిస్తే మాత్రమే సినిమా హిట్టవుతుందా.. ఇదే ప్రూఫ్ అంటూ?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు విజయ్. ఇకపోతే విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ఖుషి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సమంత ఇద్దరూ సూపర్ హిట్ సినిమాను వారి ఖాతాలో వేసుకున్నారు.

అయితే ఈ సినిమా బాగుంది సూపర్ గా ఉంది అని ఒక వర్గం ప్రేక్షకులు చెబుతుండగా, ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమా గురించి నెగటివ్ గానే ప్రచారం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ కి సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాములుగా విజయ్ దేవరకొండ తన సినిమాలను ఒకరకమైన హడావిడితో ప్రమోట్ చేస్తాడన్న విషయం తెలిసిందే. ఆ ప్రమోషన్ వల్ల పబ్లిసిటీ వచ్చినా అంతే స్థాయిలో నెగటివిటీ కూడా వచ్చేది. చాలా మంది అతి చేస్తున్నాడు అంటూ అతని మీద కసి పెంచుకునేవాళ్ళు. లైగర్ అప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఈసారి మాత్రం విజయ్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు.

లైగర్ ప్లాప్ అయినప్పటి నుండీ మెయింటైన్ చేసిన సైలెన్స్ తో ట్రాల్స్ రాడార్ నుండి కొద్దిగా బయటపడ్డాడు. సినిమా జోనర్, రిలీజ్ ముందు సైలెన్స్ హెల్ప్ అయ్యి సినిమాని మరీ క్రిటికల్ గా చూసి ఎక్కెయ్యడం లాంటివి చెయ్యనివ్వలేదు. అయితే విజయ్ సైలెన్స్ అంటే టోటల్ గా సినిమా ని సైలెంట్ చేసేసి ప్రమోషన్స్ ఆపేశారు. అది సినిమాని ఓపెనింగ్స్ అలాగే సినిమా మీద ఉన్న బజ్ ని దెబ్బ కొట్టే స్థాయికి వెళ్లడం ట్రాజెడీ. విజయ్ తన సినిమాల విషయంలో అతి చేయకుండా ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా ఉంటేనే తన సినిమా కూడా హిట్ అవుతుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -