Actors: సొంత వదిన, మరదళ్లతో రొమాన్స్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

Actors: సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలో హీరో కూతురుగా నటించిన అమ్మాయి పెద్దయిన తర్వాత అదే హీరో సరసన హీరోయిన్ గా నటించడం.. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన అమ్మాయి ఆ తర్వాత అదే హీరోకి అమ్మగా నటిస్తూ ఉండటం చూస్తూ ఉంటాము. ఇక బాలీవుడ్ లో ఈ క్రమంలో కొందరు హీరోలు తమ వదిన మరదళ్ల తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. ఇప్పుడు మనం ఆ స్టార్ హీరోలు వివరాలు తెలుసుకుందాం.

సల్మాన్ ఖాన్- మలైకా అరోరా: సల్మాన్ ఖాన్ కెరియర్ లోనే దబంగ్ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఒక పాట వరల్డ్ వైడ్ ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది. ఆ పాటలో సల్మాన్ ఖాన్ తో మలైకా అరోరా మరో స్థాయిలో చిందులు వేసింది. ఇక మలైకా ఎవరో కాదు. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య అట. ప్రస్తుతం వీరిద్దరు విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు.

శ్రీదేవి – అనిల్ కపూర్: ఇక 1990లో అనిల్ కపూర్, శ్రీదేవి కాంబినేషన్లో బాలీవుడ్లో పలు సినిమాలు తెరపైకి వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక శ్రీదేవి ఎవరో కాదు అనిల్ కపూర్ అన్నయ్య బోనీకపూర్ భార్య. అంటే అనిల్ కపూర్ కు శ్రీదేవి వరుసకు వదిన అవుతుంది. అయినప్పటికీ శ్రీదేవి తన మరిది అనిల్ సరసన హీరోయిన్ గా నటించింది.

సైఫ్ అలీఖాన్ – కరిష్మా కపూర్: ఇక మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ రెండవ పెళ్లి కరినాకపూర్ ను చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు అబ్బాయిలు కూడా పుట్టారు. సైఫ్ కరీనాను ను పెళ్లి చేసుకోక ముందు అక్క కరిష్మా కపూర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాడు. సైఫ్ అలీ ఖాన్ కు కరిష్మా కపూర్ వరుసకు వదిన అవుతుంది. ఇలా బాలీవుడ్లో పలు స్టార్ హీరోలు తమకు వరుసకు వదిన, మరదలు అయ్యే స్టార్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -