Honey Rose: నక్క తోక తొక్కిన బాలయ్య మరదలు.. పవన్ సినిమాలో ఆఫర్ అంటే మామూలు విషయమా?

Honey Rose: ప్రముఖ మలయాళీ ఇండస్ట్రీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు గ్లామరస్ బ్యూటీగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో భారీ పాపులారిటీని దక్కించుకున్న హీరోయిన్స్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న హనీ రోజ్ ఎలాంటి స్టిల్ ఇచ్చిన సరే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిపోతూ ఉంటుంది.

అప్పుడెప్పుడో శివాజీ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ భామని ఆ సినిమా హిట్ కాకపోవడంతో పెద్దగా ప్రజలు పట్టించుకోలేదు. కానీ నందమూరి బాలకృష్ణతో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సూపర్ హిట్ సినిమా వీరసింహారెడ్డిలో నటించి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య కి మరదలు పాత్రలో నటించిన ఈ భామకి ఆ సినిమాలో మంచి ప్రాముఖ్యమున్న పాత్ర లభించింది.

మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న పాటలో బాలయ్యతో పోటీపడి మరి స్టెప్పులు వేసింది. మూడున్నర పదుల వయసుకి చేరువవుతున్న ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ప్రేక్షకుల మతి పోగోడుతుంది. ఈ క్రమంలోనే ఆమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భగత్ సింగ్ సినిమాలో హనీ రోజ్ ఒక కీలక పాత్రలో నటించబోతుంది.

ఈ సినిమాలో పవన్ కి జోడిగా మెయిన్ హీరోయిన్ గా శ్రీ లీల ఎంపికైంది. ఇక మరొక కీలక పాత్రకు హనీ రోజుని దర్శకుడు హరీష్ శంకర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. హనీ అనగానే బోల్డ్ క్యారెక్టర్ అనుకుంటారు కానీ పవన్ సినిమాలో ఆమె సిన్సియర్ రోల్ చేయబోతుందని సమాచారం. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ఈ భామకి ఈ సినిమాతో దశతిరిగిపోయినట్లే అంటున్నారు సినీ వర్గాల వారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -