Raashi Khanna: రాశీఖన్నాను వాడుకుని మోసం చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

Raashi Khanna: టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2013లో విడుదలైన మద్రాస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా మారుతూ తెరకెక్కించిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతో తెలుగు ఆడియన్స్ ని మేకర్స్ ని బాగానే ఆకట్టుకుంది. మనం సినిమాలో చిన్న గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన రాశి అదే ఏడాది జోరు సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

అలా వరసగా రెండు మూడు సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి. దానికి తోడు ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే కొందరు నిర్మాతలు రాశి ఖన్నా కి ఇస్తామన్న ఆఫర్స్ ని మోసం చేసి మరో హీరోయిన్ కి కట్టబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొత్తగా ఏ హీరోయిన్ వచ్చినా రాశి ఖన్నా కి గండికొట్టినంత పనిచేసినట్టైంది. ఇలా చాలా సినిమాలు రాశి చేతి నుంచి జారిపోయాయి.

వాడుకున్నన్ని రోజులు వాడుకున్న నిర్మాతలు రాశి ఖన్నా కి మొండి చెయ్యి చూపించారట. ఒకదశలో హీరోలు కూడా అమ్మడిని చూసి లైట్ తీసుకున్నారని లోలోపల రాశి ఖన్నా మదనపడిందట. అటు తమిళ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వచ్చినా అక్కడ కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు తమిళ మీడియాలోనూ వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది సరైన అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో వరుసగా గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -