Actress Poorna: తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ.. అందుకే పెళ్లి విషయం లీక్ చేసిందా..?

Actress Poorna: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీమటపాకాయ్, అవును, అవును 2 వంటి ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం పూర్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సినిమాలలో కీలకపాత్రలలో నటించడమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెరపేక్షకులకు బాగా దగ్గరయింది.

ఇలా హీరోయిన్ గా జడ్జ్ గా మంచి గుర్తింపు పొందిన పూర్ణ ఇటీవల మే 30వ తేదీ దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షానిద్ అలీ ని నిశ్చితార్థం చేసుకుంది.అయితే నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. దీంతో పూర్ణ స్పందిస్తూ ఆ వార్తలలో నిజం లేదని వెల్లడించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూర్ణ తన పెళ్లి గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టింది. జూన్ 12వ తేదీ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో మేమిద్దరం వివాహ బంధంలోకి అడుగుపెట్టామని అందరికీ షాక్ ఇచ్చింది.

వీసా సమస్య కారణంగా తన పెళ్లికి అందరినీ ఆహ్వానించలేకపోయినట్లు వెల్లడించింది. అయితే సెలబ్రిటీలను, అభిమానులను ఆహ్వానించి కేరళలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. ఇదిలా ఉండగా పూర్ణ తన పెళ్లి విషయం బయట పెట్టడంతో తాజాగా ఆమె గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకాలం తన పెళ్లి గురించి రహస్యంగా ఉంచిన పూర్ణ ఇప్పుడు ఆ విషయం బయట పెట్టడంతో.. ఆమె గర్భవతి అని అందుకే పెళ్లి విషయం బయట పెట్టిందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

తన పెళ్లి మ్యాటర్ మరి కొంతకాలం సీక్రెట్ గా మెయింటైన్ చేయాలనుకున్న పూర్ణ ప్రెగ్నెంట్ అయ్యారని అయితే తన బేబీ బంప్ కనిపించడంతో ప్రేక్షకులకు అనుమానం వ్యక్తం చేస్తూ పెళ్లి కాకుండానే పూర్ణ ప్రెగ్నెంట్ అయ్యారు అంటూ మరింత రచ్చ చేస్తారని భావించి తన పెళ్లి విషయం ముందుగానే రివిల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్ణ పెళ్లికి సంబంధించిన విషయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇలా రహస్యంగా ఈమె వివాహం చేసుకున్నారని తెలిసి అభిమానులు ఈవిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -