Poorna: గర్భవతిగా ఉన్న సమయంలో నాని మూవీ వల్ల అలాంటి ఇబ్బందులు.. ఏం జరిగిందంటే?

Poorna:  మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం తెలుగు తమిళ భాష చిత్రాలలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి పూర్ణ గురించి పరిచయం అవసరం లేదు. అయితే ఈమె హీరోయిన్గా ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగలేకపోయారు. హీరోయిన్ తక్కువ సమయంలోనే ఫెయిడౌట్ అయినటువంటి పూర్ణ ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా ఈమె స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండడమే కాకుండా మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే పూర్ణ వ్యక్తిగత జీవితంలో కూడా బిజీగానే ఉన్నారు ఈమె పెళ్లి చేసుకున్న వెంటనే ఒక కుమారుడికి జన్మ ఇచ్చారు దీంతో కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంత సంతోషంగా బిజీగానే గడుపుతున్నారు.

ఇక ఈమె చివరిగా దసరా సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే దసరా సినిమా షూటింగ్ సమయంలో తాను గర్భవతి అని అయితే గర్భవతిగా ఉన్న సమయంలోనే ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. ఇలా ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను కాస్త ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాను అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పలు విషయాలను వెల్లడించారు.

దసరా సినిమాలో తన పాత్రకు సంబంధించి ఎక్కువగా రాత్రి పూట షూటింగ్ చేయాల్సి వచ్చిందట అయితే తాను ప్రెగ్నెన్సీ తో ఉన్న సమయంలో రాత్రిపూట షూటింగ్ అంటే ఆ చలికి కాస్త ఇబ్బందులు పడ్డానని తెలిపారు. అదే విధంగా రెండు రాత్రులు తాను వర్షంలో నటించాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. దీంతో చిత్ర బృందం తనపై చల్లనీళ్ళను పోస్తూ ఈ షూటింగ్ చేశారు. ఇలా చల్ల నీళ్లు తగలడం వల్ల తనకు చాలా సమస్యలు వచ్చాయని దాంతో చల్ల నీళ్లు కాకుండా గోరువెచ్చని నీరు నాపై వేస్తూ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారని తెలిపారు.

అలాగే ఈ సినిమాలో ఒంటరిగా తాను రోడ్డుపై చెప్పులు లేకుండా పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఈ సీన్ చేసేటప్పుడు చాలా భయపడ్డానని వీధి కుక్కలు గట్టిగ అరవడంతో తనకు చాలా భయం వేసేదని అదృష్టవశాత్తు అవి నన్ను కరవకుండా వదిలేసాయి అంటూ తెలిపారు. ఇలా ఈ సినిమా కోసం ఇంత కష్టపడి షూటింగ్ చేసినప్పటికీ కొన్ని సన్నివేశాలను తొలగించారని, అయితే ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న అంతసేపు చిత్ర బృందం నా గురించి ప్రత్యేకంగా శ్రద్ధలు తీసుకున్నారు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -