Actress Pragathi: ఏడ్చేసిన నటి ప్రగతి.. ఆ పాత్రలో నటించమన్నారని..?

Actress Pragathi:  నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరును, పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే సినిమాల్లో హీరో, హీరోయిన్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. క్యారెక్టర్ ఆర్టిస్టులకూ అంతే ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ.. తనకు సంబంధించిన డైలీ అప్‌డేట్లను పోస్ట్ చేస్తుంటారు. అలా తనకంటూ క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం నటి ప్రగతి సినిమాలతోపాటు అప్పుడప్పుడూ షోలో కూడా కనిపిస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు.

తాజాగా నటి ప్రగతి ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఫ్యామిలీతో తనకున్న సాన్నిహిత్యాన్ని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా నటి ప్రగతి మాట్లాడుతూ.. ‘చంద్రబాబు భార్యను నేను ఆంటీ అని పిలిచే దాన్ని. అలాంటిది నేను మొదటిసారిగా చంద్రమోహన్ భార్య పాత్రలో నటించాల్సి వచ్చింది. మదర్ క్యారెక్టర్ చేసినప్పుడు తన వయసు కేవలం 24 ఏళ్లే.

అప్పటికీ నేను హీరోయిన్‌గా కూడా చేస్తున్నా. చిన్న వయసులోనే హీరో, హీరోయిన్లకు తల్లి క్యారెక్టర్ చేయాల్సి వచ్చినప్పుడు నాకెంతో బాధేసింది. ఎంతో ఏడ్చేదాన్ని. మొదటి రోజే సెట్‌లోకి వెళ్లినప్పుడు నా జడను చూసి కామెంట్ చేశారు. నాకు ఏడుపు ఆగలేదు. మేకప్ రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేశాను. ఆ తర్వాత నుంచి మదర్ క్యారెక్టర్లు వేయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత నుంచి అవకాశాల కోసం ఎవరినీ అడగలేదు.’ అని ప్రగతి తెలిపారు. కాగా, ప్రస్తుతం ప్రగతి రెమ్యునరేషన్ బాగానే తీసుకుంటారు. ఒక్కరోజుకు దాదాపు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు తీసుకుంటారని సమాచారం. అయితే సినిమా డిమాండ్‌ను బట్టి రెమ్యునరేషన్ కూడా పెంచుతారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -