Pragathi: వైరల్ అవుతున్న ప్రగతి ఆంటీ షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

Pragathi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులతో పాటు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసే క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసే పాత్రను బట్టి ఆ క్యారెక్టర్ ను అందరూ గుర్తింపుకుంటారు. తెలుగులో వందల మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండగా..అందులో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి.

 

తెలుగులో మోడ్రన్ మదర్ గా, వదినగా, అక్కగా, అత్తగా ఇలా రకరకాల పాత్రలు వేస్తున్న ప్రగతి.. ప్రస్తుతం కేవలం సినిమాల వల్లే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ద్వారా ఎక్కువ పాపులర్ అవుతోంది. మరీ ముఖ్యంగా లేటు వయసులోనూ చెమటలు చిందిస్తూ జిమ్ లో తెగ వర్కవుట్ చేసే వీడియోలను ప్రగతి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాటికి వేలలో లైక్ లు, కామెంట్లు వస్తున్నాయి.

 

భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న ప్రగతి.. వర్కవుట్ వీడియోలతో అందరిలో హీట్ పుట్టించడంతో పాటు అప్పుడప్పుడు తన పోస్టులతో అందరిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇండస్ట్రీలో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చి, దానిపై చర్చ జరిగేలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. ప్రగతి పోస్ట్ చేసిన ఫోటోను చూసిన నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. చేతిలో మందు గ్లాసు కలిగి ఉన్న తన ఫోటోను ప్రగతి పోస్ట్.. తన అభిప్రాయాన్ని రాసుకొచ్చింది.

 

ప్రగతి తన సోషల్ మీడియా పోస్ట్ లో ఇలా రాసింది.. ‘జీవితంలో ఎప్పుడూ మనం ప్రయత్నించడం ఆపకూడదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ ఆశతో జీవిస్తూ ఉంటే అన్ని అలా జరగాల్సిన విధంగా జరుగుతుంది. ఆశతో ప్రయత్నిస్తూ ఉంటే కచ్చితంగా మనం అనుకున్నది సాధించగలం.. లైఫ్ లో ఎప్పుడూ ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వకూడదు’ అని రాసుకొచ్చింది. దీంతో మందు గురించి చెబుతోందా? లేదంటే వేరే విషయం గురించి చెబుతోందా అనే చర్చ సాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -