Priya Varrier: ఆ హీరో అంటే అదోరకం పిచ్చి… ప్రియ వారియర్ కామెంట్స్ వైరల్!

Priya Varrier: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా గుర్తింపు పొందాలంటే అవకాశాలతో పాటు అదృష్టం కూడా ఉండాలి. కొన్ని సందర్భాలలో అవకాశాలు ఎక్కువగా లేకపోయినా కూడా అదృష్టం వల్ల ఓవర్ నైట్ లో స్టార్లుగా మారిపోతూ ఉంటారు. ఇలా ఓరు ఆధార్ లవ్ సినిమాలోని ఒక వీడియోలో కన్ను గీటి యువతకి నిద్ర లేకుండా చేసిన ప్రియా వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఒకే ఒక్క వీడియోతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన ప్రియా వారియర్ కి సినిమాలలో అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తూ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని హింట్ ఇస్తోంది. అయినప్పటికీ తెలుగు , కన్నడ భాషలలో అడపాదడపా అవకాశాలు అందుకుంటున్న కూడా తమిళ భాషలో మాత్రం ఒక్క సినిమా అవకాశం కూడా దక్కించుకోలేకపోయింది.

ఈ క్రమంలో తమిళ భాషలో ఎలాగైనా సినిమా అవకాశాలు దక్కించుకోవాలని ప్రియా వారియర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలలో భాగంగానే కోలీవుడ్ స్టార్ హీరో అయిన ధనుష్ మీద కన్నేసింది. సోషల్ మీడియాలో తరచూ ధనుష్ కి సంబంధించిన పోస్ట్ లు షేర్ చేస్తూ తనని ఇంప్రెస్ చేయడానికి నానా అవస్థలు పడుతోంది. ఈ క్రమంలో ధనుష్ గురించి ఎందుకు ఇలా పోస్ట్ లు పెడుతున్నారు? అని మీడియా ప్రశ్నించగా.. ధనుష్ అంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టం అంటూ సమాధానాలు చెబుతోంది.

హీరో ధనుష్ తో కలిసి నటించాలని ఎంతో ఆశగా ఉంది… ధనుష్ అంటే అదోరకం పిచ్చి, తొందరలోనే ఆయనతో నటించే అవకాశం లభిస్తుందని ప్రియా వారియర్ హాట్ కామెంట్స్ చేసింది. దీంతో హీరోయిన్ గా అవకాశాలు అందుకోవటానికి ధనుష్ ని బుట్టలో వేసే పనిలో పడిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేస్తున్న గ్లామరస్ ఫోటోలకి కుర్రాళ్ళు ఫిదా అవుతూ ఆమెకు ఫాలోవర్లుగా మారుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -