Heroes: హీరోల గుండు లుక్.. అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉండనుందా?

Heroes: సినిమాలలో హీరో అంటే చాలా స్టైలిష్ గా కనపడితేనే ప్రేక్షకులు కూడా ఆ సినిమాలను ఆదరిస్తారు అలా కాకుండా హీరోలను గుండుతో చూడాలి అంటే ప్రేక్షకులకు కాస్త కష్టతరంగానే ఉంటుంది. గుండులో వారి లుక్ బాగుంటుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే కథ డిమాండ్ చేస్తే కొందరు హీరోలు ఇలా గుండులో కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు హీరోలు గుండు లుక్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా గుండు లుక్ లో కనిపించలేదు. అయితే ఈయన మొదటిసారిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న భోళా శంకర్ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ లో గుండు పాత్రలో కనిపించబోతున్నారట అయితే ఇది ఆయనకు సెట్ అవుతుందా లేదా అన్న ఉద్దేశంతో మేకర్స్ ముందుగానే ఈయనకు జుట్టు పైనే ప్రోస్టేటిక్ మేకప్ వేసి తన లుక్ పరిశీలించిన అనంతరం ఈ క్యారెక్టర్ డిజైన్ చేశారు. మరి మొదటిసారి గుండు పాత్రలో నటించబోతున్న చిరంజీవి ఎలా మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

 

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి తాజా చిత్రం బర్రోజ్. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఈయన గుబురు గడ్డం గుండు పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ఈయన ఒక నిధిని కాపాడే పాత్రలో నటించబోతున్నారు.వాస్కోడిగామా నిజమైన వారసుడికి మాత్రమే ఆ నిధి దక్కాలి అని 400 సంవత్సరాలుగా నిధిని కాపాడుతూ ఉన్నటువంటి పాత్రలో మోహన్ లాల్ కనిపించబోతున్నారు.

 

ఇక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సైతం తాను దర్శకత్వం వహించబోతున్నటువంటి ప్రస్తుత సినిమాలో గుండు పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాకు ఈయన దర్శకత్వం వహించడం విశేషం ఎలాగో ఈ సినిమాలో గుండు పాత్రలో నటించాలి కనుక ఈయన తాజాగా తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించిన సంగతి తెలిసిందే. మరి ఈ గుండు పాత్రలలో నటిస్తూ ఈ హీరోలు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -