Regina-Nivetha: ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్స్!

Regina-Nivetha: ప్రస్తుతం ఎన్టీఆర్ టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. వరల్డ్ వైడ్ గా వచ్చే సినిమా ఆఫర్లను తన సొంతం చేసుకొని షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే నివేదా థామస్, రేజీనా కలిసి నటించిన సినిమా నెక్స్ట్ వీక్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇద్దరు ముద్దుగుమ్మలు ఒక రేంజ్ లో హడావిడి చేస్తున్నారు.

ఇక తాజాగా వీరిద్దరూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి. ఎన్టీఆర్ గురించి రెజీనా మాట్లాడుతూ ఎన్టీఆర్ చాలా మంచోడు మంచి మనసుతో ట్రీట్ చేస్తాడు అన్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇది చాలా అరుదుగా జరుగుతుందని తెలిపింది. ఇక ఎన్టీఆర్, కమల్ ఇద్దరూ కొన్ని విషయాల్లో ఓకేలా ఉంటారని తెలిపింది.

ఇక నివేదా థామస్ జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరూ రొమాన్స్ మరో స్థాయిలో పండింది. కానీ స్టోరీ పరంగా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయారు. కాగా నివేదా థామస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తారక్ ఎనర్జీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది అని తెలిపింది. ఎప్పుడు చూసినా కూడా ఎన్టీఆర్ అలిసిపోడు అని తెలిపింది. ఇక ఎన్టీఆర్ ని చూసినప్పుడల్లా తనకి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది అన్నట్లు తెలిపింది.

అంతేకాకుండా ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి బాగా సహాయపడతాడు అని తెలిపింది. ఇక కమల్ సార్ లా ఎన్టీఆర్ చాలా ఫన్నీ గా ఉంటాడు అని నివేదా థామస్ చెప్పుకు వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ చేసినా వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఉన్నట్టుండి వీరిద్దరూ ఎన్టీఆర్ మీద అభిమానం పెంచుకోవడం ఏమిటి? ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అన్నట్లు ఎన్టీఆర్ అభిమానులు ఊహించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Polavaram Project: పోలవరం వైపు ఒకసారి చూసి ఓటు వేయండి.. ఏపీలో ఇంత దారుణ పరిస్థితులా?

Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున కరువు కాటకాలను ఎదుర్కొంటూ ఉందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు...
- Advertisement -
- Advertisement -