Actress Rekha Boj: వాళ్లను చూసి తెలుగు దర్శకులు బుద్ధి తెచ్చుకోండి.. ఫైర్ అయిన నటి రేఖా బోజ్?

Actress Rekha Boj:  సాధారణంగా తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువగా వస్తాయనే విషయం మనకు తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో తెలుగు వాళ్లకు హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వకపోయినా సెకండ్ హీరోయిన్ గాను లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అవకాశాలు ఇస్తారు ఇలా తెలుగు వారికి అవకాశం లేవంటూ ఎంతో మంది తెలుగు నటిమనులు ఈ విషయంపై విచారణ వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా తెలుగు నటి రేఖా బోజ్ ఈ విషయంపై స్పందించి తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైన కాంతార కేజిఎఫ్ వంటి సినిమాలలో నటించిన తెలుగు దర్శకుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.కే జి ఎఫ్ కాంతార వంటి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమాలలో కూడా హీరోయిన్లను సొంత భాషా హీరోయిన్లను తీసుకొని సినిమాలు చేశారు. వారిని చూసి తెలుగు దర్శకులు బుద్ధి తెచ్చుకోండి అంటూ ఈమె కామెంట్ చేశారు.

కార్తికేయ 2 లో ఆ మలయాళీ కాకుండా తెలుగు అమ్మాయి ఉన్నా కూడా ఆ సినిమా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది.మనం తీసే సినిమాలో కంటెంట్ మన గుండెలో ధైర్యం ఉండాలి కానీ హీరోయిన్లతో పనిలేదని కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు కానీ హీరో హీరోయిన్లను చూసి సినిమాలను ఆదరించలేదని ఈమె తెలిపారు. నార్త్ హీరోయిన్స్ మలయాళీ అమ్మాయిలు వచ్చి ఇక్కడ చేసేదేమీ లేదు.

ఒక తెలుగు డైలాగ్ చెప్పమన్నా కానీ చెప్పలేని పరిస్థితి వాళ్ళది ఇలా డైలాగులు చెప్పడానికి కూడా రానటువంటి ఆ హీరోయిన్లే మన వాళ్లకు కావాలి. ఇక మన తెలుగు సినిమాల దరిద్రం ఏంటంటే చిన్న హీరోలైన రాజు తరుణ్, కళ్యాణ్ దేవ్, విశ్వక్ వంటి హీరోలకు కూడా నార్త్ ఇండియన్ హీరోయిన్స్ కావాల్సి ఉంటుందంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -