Producer: నిర్మాత కష్టాన్ని అర్థం చేసుకోవవచ్చుగా.. అలా చేయడం రైటేనా?

Producer: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కార్తికేయ 2 సినిమా ద్వారా హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ సినిమాతో సక్సెస్ సాధించినటువంటి నిఖిల్ తన తదుపరి సినిమాలన్నింటినీ కూడా పక్కా ప్రణాళికతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. స్పై సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

మరి కొద్ది రోజులలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హీరో నిఖిల్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు రానని మొండి పట్టు పట్టుకుని కూర్చున్నారు. ఇందుకు గల కారణం నిర్మాతకు హీరోకి మధ్య మనస్పర్ధలు తలెత్తడమేనని తెలుస్తోంది.నిఖిల్ ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి కాస్త సమయం కావాలని ప్రమోషన్ కార్యక్రమాలు అందించిన కూడా ప్రణాళిక వేసుకున్నారు కానీ అంతవరకు ఉంటే సినిమాకు కోట్లలో నష్టం వస్తుందని భావించిన నిర్మాత హీరోకు ఇష్టం లేకపోయినా సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

 

ఇలా తనకు ఇష్టం లేకుండా నిర్మాత సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో ఈయన కూడా ఈ సినిమాని చాలా లైట్ గా తీసుకొని ప్రమోషన్లకు హాజరు కాలేకపోతున్నారు. దీంతో పలువురు నిఖిల్ వ్యవహార శైలి పై కామెంట్లు చేస్తున్నారు. నిర్మాతకు కనీసం తెలియకపోవచ్చు హీరో కైనా ఈ విషయం గురించి కాస్త బుద్ధి ఉండాలి కదా.సినిమా ఎప్పుడు విడుదల చేసిన ఎలాంటి సక్సెస్ అందుకున్న ఆ ఎఫెక్ట్ హీరో పై తప్పకుండా ఉంటుందనే విషయం నిఖిల్ కి తెలియదా అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

ఇక ఇక్కడ మరొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సినిమా ఎప్పుడు విడుదలైంది అనేది కాదు ముఖ్యం సినిమాలో కంటెంట్ ఉంటే ప్రచారం కూడా అవసరం లేకుండా సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది.నిర్మాత తన మాట వినకపోతే నిర్మాత దారిలోనే నిఖిల్ కూడా వెళ్లి సినిమాని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ ఈయన మాత్రం నిర్మాతల కష్టాన్ని అర్థం చేసుకోకుండా ఇలా మొండి పట్టుకోవడంతో పలువురు హీరో పై విమర్శలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -