Nikhil: తండ్రి బాధ్యతల వల్ల నిఖిల్ కు అలాంటి కష్టాలు.. ఏమైందంటే?

Nikhil: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో నటుడు నిఖిల్ ఒకరు. హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నిఖిల్ అనంతరం సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇకపోతే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా పుట్టబోయే బిడ్డకు డైపర్స్ ఎలా మార్చాలి అనే విషయాల గురించి నిఖిల్ కు స్పెషల్ క్లాసెస్ తీసుకున్నారు.

 

నిఖిల్ 2020వ సంవత్సరంలో డాక్టర్ పల్లవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇలా వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. పెళ్లయిన మూడు సంవత్సరాలకు వీరు తమ మొదటి బిడ్డకు స్వాగతం చెప్పబోతున్నారు ఈ క్రమంలోనే తన భార్య సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ విధంగా తన భార్య ఫోటోలను షేర్ చేస్తూ మేము మా మొదటి బిడ్డకు త్వరలోనే వెల్కమ్ చెప్పబోతున్నామని ఈ విషయంలో నేను పల్లవి చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. ఈ క్రమంలోని పల్లవి స్నేహితులు చిన్న పార్టీ అరేంజ్ చేయడమే కాకుండా నిఖిల్ కి పుట్టబోయే బిడ్డకు డైపర్ ఇలా చేంజ్ చేయాలి అనే విషయం గురించి స్పెషల్ క్లాసెస్ తీసుకున్నారు.

 

ఒక జిరాఫీ బొమ్మను తీసుకొని దానికి డైపర్ వేయడం తీయడం వంటివి చేసి తనకు కూడా డైపర్లు మార్చడం నేర్పించారు ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ డైపర్లు మార్చడం నేర్చుకుంటున్నాను అంటూ తెలియజేశారు. దీంతో తండ్రి కాబోతున్న నిఖిల్ కి ఎన్ని కష్టాలు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -