Hyper Adi: తొమ్మిదో తరగతిలోనే మొదటిసారి ప్రేమలో పడ్డ ఆది.. లవ్ స్టోరీ మామూలుగా లేదు?

Hyper Adi: హైపర్ ఆది బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. అయితే ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఢీ కార్యక్రమం ద్వారా హైపర్ ఆది పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇప్పటికే ఈ కార్యక్రమం 13 సీజన్లను పూర్తి చేసుకుని 14వ సీజన్ ప్రసారమవుతుంది.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు ఈ ప్రోమోలో భాగంగా ఈసారి లవ్ థీమ్ కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లో కూడా లవ్ సాంగ్స్ కి పెర్ఫార్మన్స్ చేయనున్నారు. ఇక ఈ ప్రోమోలో ప్రతి ఒక్కరు కూడా వారి ఫస్ట్ లవ్ గురించి మాట్లాడారు.

ఇక హైపర్ ఆది సైతం మొదటిసారిగా ఢీ వేదికపై తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ తాను ఎనిమిదవ తరగతి వరకు తన సొంత ఊరిలోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు.9వ తరగతి కోసం తాను ప్రవేట్ పాఠశాలకు వెళ్లాలని అయితే ఒక రోజు స్కూల్ పూర్తి అయి తరగతి నుంచి బయటకు వస్తుండగా ఒక అమ్మాయిని చూశానని తెలిపారు.

ఆరోజు ఆ అమ్మాయి చూడగానే తనలో కలిగిన భావాలను వర్ణించలేనంటూ ఈయన తెగ సిగ్గుపడుతూ తన మొదటి ప్రేమ గురించి బయట పెట్టారు.ఇలా హైపర్ ఆది 9వ తరగతిలోనే ఒక అమ్మాయిని చూసి మంత్రముగ్ధుడయ్యాడని ఈ సందర్భంగా చెప్పడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.ఇక హైపర్ ఆది తన ప్రేమ గురించి మరిన్ని విషయాలు ఏం చెప్పారు ఏంటి అనే విషయం తెలియాలంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ఆగస్టు 24వ తేదీ ప్రసారం అవుతుంది అప్పటివరకు వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -