Nara Lokesh: అత్యంత ధనవంతుడిగా నారా లోకేష్.. సంచలన విషయాలు బయటపెట్టిన ఏడీఆర్

Nara Lokesh: ఒకప్పుడు రాజకీయాలు అంటే సాంప్రదాయబద్దంగా ఉండేవి. ప్రజలకు సేవ చేయాలనుకునేవారు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చేవారు. ప్రజలకు ఎంతోకోంత సేవ చేసేవారు. పేదలకు తమ వంతు సహయం చేసేవారు. ఎక్కువమంది రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయాలని, తమకు తోచినంత మేలు చేయాలని భావించేవారు. స్వార్థ రాజకీయాలు, డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చేవారు చాలా తక్కువమంది ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చారు. డబ్బులు సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చేవారు ఎక్కువైపోయారు.

రాజకీయ అండతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. కాంట్రాక్టులు, కమీషన్ల పేరుతో రాజకీయ నాయకులు కోట్లు గడిస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి అధికారులను చెప్పచేతుల్లో పెట్టుకుని అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇటీవల ఏ రాజకీయ నాయకుడు చూసినా కాంట్రాక్ట్ కంపెనీలు, బినామీ వ్యక్తుల పేరుతో వ్యాపారాలు లాంటి వ్యవహారాలే కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించే ఆస్తులు కొన్నే. కానీ బినామీ వ్యక్తులతో వ్యాపారాలు చేయిస్తూ ఉంటారు. వాటి లెక్క అనేది ఎవరికీ తెలియదు.

తాజాగా అసోసియేషణ్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రాజకీయ నాయకుల ఆస్తులపై ఒక నివేదికను బయటపెట్టింది. ఇందులో ఏపీ ఎమ్మెల్సీల ఆస్తులు, విద్యార్హత, క్రిమినల్ కేసుల వివరాలను వివరించింది. ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా వీటిని బయటపెట్టింది. దీని ప్రకారం ఏపీ ఎమ్మెల్సీలలో 20 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో వైసీపీ సభ్యులు 13 మంది ఉండగా.. టీడీపీ సభ్యులు ఆరుగురు, పీడీఎఫ్ చెందిన సభ్యురు ఒకరు ఉన్నారు. ఇక ఆస్తుల విషయానికొస్తే.. ఎమ్మెల్సీలలో 12 మందికి రూ.12 కోట్లకుపైగా ఉన్నట్లు తేలింది.

ఇందులో అత్యధిక ఆస్తి ఉన్న ఎమ్మెల్సీగా నారా లోకేష్ నిలిచారు. నారా లోకేష్ ఆస్తి రూ.369.7 కోట్లుగా ఉంది. ఇక వాకాటి నారాయణరెడ్డి రూ.101 కోట్లతో రెండో స్థానంలో ఉండగా.. టి.మాధవరావు రూ.36 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక అతి తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ అభ్యర్థి రఘువర్మ రూ.1.84 లక్షలతో ఉన్నారు. ఇక లోకేశ్ కు రూ.6.27 కోట్లు అప్పు ఉన్నట్లు ఈ నివేదికలో బయటపెట్టగా.. వైసీపీ ఎమ్మెల్సీ దేవసినా చిన్న గోవిందరెడ్డికి రూ.5.23 కోట్లు అప్పు ఉన్నట్లు తేలింది. ఇక ఎమ్మెల్సీలలో 36 మంది కోటీశ్వరులు ఉన్నారు.

ఇక ఎమ్మెల్సీలలో ఇద్దరికి డాక్టరేట్ ఉండగా.. 8 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 40 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నట్లు ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది. ఇక నలుగురు ఇంటర్మిడియట్ పూర్తి చేయగా.. ఒకరు పదో తరగతి, మరోకరు ఐదో తరగతి పూర్తి చేశారు.ఇక తీవ్రమైన కేసులు ఉన్నవారితో వైసీపీ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, గంగుల ప్రభాకర్ రెడ్డి, అనంత సత్యభాస్కర్ ఉన్నారు. ఇక ముగ్గురు మహిళా ఎమ్మెల్సీలు ఉండగా.. వైసీపీ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు ఉన్నారు.

ఇక అతిపెద్ద వయస్సు ఉన్న ఎమ్మెల్సీలు సైతం వైసీపీలో ఉన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు 86 కాగా.. మురుగుడు హనుమంతరావుకు 73 ఏళ్లు, సి.రామచంద్రయ్యకు 71 ఏళ్లుగా ఉన్నాయి. ఇలా ఏడీఆర్ నివేదిక పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -