Drinking Water: వేడి నీళ్లు తాగితే లాభాలతో పాటు, నష్టాలు కూడా..

Drinking Water: వేడినీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. అందుకే కొందరు ఎండాకాలమైనా ఒక్కపూట వేడినీళ్లు తాగుతుంటారు. చాలామంది బరువు తగ్గించుకోవడానికి వివిధ పద్ధతులను పాటిస్తుంటారు. కొందరు ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటుండగా.. మరికొందరు యోగా, వ్యాయామాలు వాకింగ్, చేస్తుంటారు.

ఈ రోజుల్లో వ్యాయామం, జిమ్‌ చేయడం అనేది బెల్లీఫ్యాట్ని తగ్గించడానికే. అయితే బరువు తగ్గడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గాలలో ఒకటి గోరువెచ్చని నీరు తాగడం. తరచుగా మహిళలు బరువు తగ్గడానికి వేడి నీటిని తాగుతారు.

నీరు తాగడం ఆరోగ్యానికి ఎల్లప్పుడూ మేలు చేస్తుంది. వేడి నీరు శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుంది. దీని కారణంగా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు దూరమవుతాయి. వేడినీరు తాగడంతో జీవక్రియ మెరుగై ఆకలిని తగ్గిస్తుంది. ఆహారం తిన్న తర్వాత వేడి నీటిని తాగితే అది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మలబద్ధకం, ఎసిడిటీ, అజీర్ణ సమస్యలు వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.

ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత వేడి నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు. ప్రతిరోజూ ఉదయం వేడి నీటిని తాగితే కొవ్వు కరిగిపోతుంది. భోజనం తర్వాత వేడినీరు తాగడంతఓ జీర్ణక్రియ మెరుగవుతుంది. కొవ్వు అదుపులో ఉంటుంది. రోజూ ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగితే బెల్లీ ఫ్యాట్‌ తగ్గుతుంది. వేడి నీరు బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. వేడి నీటిని ఎక్కువగా తాగడంతో సిరల్లో వాపు వస్తుంది. దీని కారణంగా కొన్నిసార్లు మెదడు నరాలు స్వభావితమై తలనొప్పి సమస్య ఏర్పడుతోంది. వేడి నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. అయితే అధిక మొత్తంలో వేడి నీటిని తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. వేడి నీరు తాగడం వల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -