Pot water: కుండలో నీరు తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Pot water: వేసవికాలం మొదలవడంతో భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండలు మాత్రం భీభత్సంగా కొడుతున్నాయి. ఎండాకాలం వచ్చింది అంటే చాలా చల్లని నీరు, చల్లని పానీయాలు తాగడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలా ఎండకు కొద్దీ సేపు వెళ్ళొచ్చారు అంటే చాలు వెంటనే ఫ్రిడ్జ్ లో ఉండే నీటిని తాగేస్తూ ఉంటారు. ఇక ఎండలో పనిచేసే వారి సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని నీళ్లు అయినా కూడా గడగడ తాగిస్తూ ఉంటారు.. అయితే టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి ఫ్రిడ్జ్ ల వాడకం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ లు దర్శనమిస్తున్నాయి.

అయితే పల్లెటూరులో చాలామంది ఫ్రిడ్జ్ లో వాటర్ కంటే కుండలోని నీరు బెస్ట్ అంటూ కొందరు నీటిని తాగుతూ ఉంటారు. అయితే చాలామందికి కుండలోని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియక ఫ్రిడ్జ్ లో నీరు తాగాలని ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. నిపుణులు కూడా కుండలోని వాటర్ తాగడమే బెస్ట్ అని అంటున్నారు. కుండలోని వాటర్ తాగడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కుండలో పోసిన నీళ్లు వంద శాతం ప్యూరిఫైడ్‌ చేసిన నీటితో సమానం. కుండలో నీళ్ళు వేపరైజేషన్ పద్ధతిలో నీటిని సహజంగా చల్లగా చేస్తుంది.

 

కుండకి ఉన్న చిన్న చిన్న రంధ్రాల వల్ల అందులోని నీటికి హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అతి దాహం, ఒళ్ళు పేలడం వంటివి రావు. అందులో నీళ్ళు చల్లగా ఉండడమే కాదు, అవి శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తాయి. పీహెచ్ బాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తుంది. కుండలోని నీళ్ళు తాగడం వలన ఎసిడిటీ లాంటి గాస్ట్రిక్ ప్రాబ్లంస్ రాకుండా ఉంటాయి. కుండలోని నీళ్ళు తాగడం వలన దగ్గు, జలుబు వంటివి రావు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ , గొంతు నొప్పి ఉండదు. మంటి కుండలో నీళ్లు పోసి తాగడం వల్ల నీళ్లలోని సహాజ మినిరల్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి అందించి ఎనర్జీని అందిస్తాయి. వేసవిలో వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది. రెగ్యులర్‌గా కుండలో నీళ్ళు తాగడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దూరం అవుతాయి. అంతేకాకుండా ఫ్రిజ్లో నీరు ఎన్ని తాగినా కూడా పదే పదే తాగాలని అనిపిస్తూ ఉంటుంది. దాహం తీరదు. కానీ కుండలో నీరు తాగడం వల్ల అవి దాహాన్ని తీర్చడంతో పాటు చల్లని అనుభూతిని కలిగిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -