Akhil: ఆ రీజన్ వల్లే అఖిల్ పెద్ద డైరెక్టర్లకు దూరమా.. ఏం జరిగిందంటే?

Akhil: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తాజాగా నటించిన చిత్రం ఏజెంట్. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అఖిల్ కెరియర్ లోని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవడంతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుండడం విశేషం. ఈ సినిమా ఈనెల 28వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో అఖిల్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేయడం తనకు ఇష్టమే కానీ అటువంటి ప్రతిపాదనలు ఆ డైరెక్టర్ల నుంచి కూడా రావాలని తెలిపారు అఖిల్. తనకు నచ్చిన జనాలతో కలిసి పని చేస్తే అది వేరేగా ఉంటుందని తెలిపారు. మొదటి సినిమా ఫెయిల్ అయిన తర్వాత నిరాశ చెందాను.

 

ఆ సమయంలో ఒకటి రెండు రోజులు గదిలో నుంచి బయటకు కూడా రాలేదు ఒంటరిగా ఉన్నాను. నా కెరియర్ గురించి ఎప్పుడూ కూడా మా నాన్నతో గొడవ పడలేదు. మేము ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉంటాము అది నా అదృష్టం అని చెప్పుకొచ్చారు అఖిల్. అలాగే తన తల్లి ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ కోణంలోనే చూస్తారని చెప్పారు అఖిల్. కాగా అఖిల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ద పెద్ద డైరెక్టర్లు అఖిల్ ని దూరం పెడుతున్నారా, పాపం అఖిల్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -