Akhil: రోజురోజుకు అలా మారిపోతున్న టీవీ షోస్!

Akhil: ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ కంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ సోలా హవా నడుస్తుంది. ఏ ఛానల్ చూసిన అందులో రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు, రియాలిటీ షోలు ప్రసారం అవుతూ బాగా సందడి చేస్తున్నాయి. ఇక ప్రేక్షకులు కూడా ఇటువంటి షోలను చూడటానికి కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడే కాదు ఒకప్పటి నుంచి ప్రసారమవుతున్నాయి.


అప్పట్లో ప్రోగ్రాం వస్తుందంటే చాలు ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. అసలు ఫ్యామిలీతో చూడాలంటే సిగ్గుగా అనిపించేటట్టు చేస్తున్నారు కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు. ఇప్పుడొస్తున్న షో లలో సెలబ్రెటీలు పాల్గొని తమ పర్ఫామెన్స్ తో బాగా రెచ్చిపోతున్నారు. ఇక ఎక్కువగా డాన్స్ షో లలో మాత్రం బాగా తెగించేస్తున్నారు అని చెప్పాలి.

అందులో డాన్స్ స్టెప్పుల కంటే రొమాన్స్ లు చేసేది ఎక్కువగా ఉంటుంది. ఇక అవి చూడాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఇప్పుడు అటువంటిదే ఒక ప్రోగ్రాం నడుస్తుంది. స్టార్ మా లో ప్రస్తుతం బిబి జోడి అనే డాన్స్ ప్రోగ్రాం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇదివరకు బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు జంటగా మారి తమ పర్ఫామెన్స్ తో బాగా సందడి చేస్తున్నారు.

కొంతమంది మాత్రం డాన్స్ కంటే ఎక్కువగా రొమాన్స్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా తేజస్వి, అఖిల్ మాత్రం బాగా రెచ్చిపోతున్నారు. వీరిద్దరూ ప్రతిసారి ఏదో ఒక స్పైసీ తనంతో వేదిక మీదికి వస్తున్నారు. అయితే గతంలో వీరిద్దరూ ఒక సాంగ్ కు డాన్స్ చేశారు. నిజానికి అది డాన్స్ అనకూడదని చెప్పాలి. అది మొత్తం రొమాన్స్ తో కూడిన స్టెప్ లని అనాలి.

ఏకంగా బెడ్ పై ఇద్దరూ ఘాటు పెర్ఫామెన్స్ తో రెచ్చిపోయారు. ఇక అప్పటినుంచి ఈ షో పై నెటిజన్స్ బాగా ఫైర్ అవుతున్నారు. ఫ్యామిలీతో చూడాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది అంటూ.. అసలు ఇది షో నా లేక ఆ వీడియోలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది.. ఈ టీవీ షోస్ రోజు రోజుకి అలా మారిపోతున్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -