Akhil: ఏఎన్ఆర్ ను ఫాలో అవుతున్న అఖిల్.. సక్సెస్ అవుతాడా?

Akhil: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కింగ్ అక్కినేని నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సరైన హిట్టు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నప్పటికీ సక్సెస్ ను సాధించలేకపోతున్నాడు. 2021 లో విడుదల అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పర్వాలేదు అనిపించేలా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అంతకుముందు అఖిల్ మిస్టర్ మజ్ను లాంటి సినిమాలలో నటించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి.

ఇకపోతే అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్. పాన్ ఇండియా లెవెల్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విడుదల అయ్యి ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా వారం రోజులు కూడా ఆడకముందే థియేటర్లో నుంచి తీసేసారు. ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అఖిల్ ని ఏకి పారేశారు. అంతేకాకుండా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అఖిల్ కూడా ఒక సింగల్ గా వేకెషన్ లకు వెళ్ళిపోయాడు.

 

ఈ సినిమా అఖిల్ కెరీర్ నో టర్న్ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా అఖిల్ కి మరొక డిజాస్టర్ ని తెచ్చి పెట్టింది. అ సంగతి పక్కన పెడితే తాజాగా అఖిల్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. అఖిల్ తన తాత అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన మాటలను ఫాలో అవ్వాలని చూస్తున్నారట. సినిమాల పరంగా ప్రేక్షకుల మనసులు దోచేయాలని అఖిల్ చిన్నతనంలో సలహాలు ఇచ్చేవారట ఏఎన్ఆర్. దాంతో కథలో బలం ఉండాలని తెలుసుకున్నాడట అఖిల్. ఇక మీదట మంచి కథలను ఎంపిక చేసుకుని డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలను చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -