Akkineni Akhil: అక్కినేని అఖిల్ కు ఇంతకు మించిన మరో అవమానం ఉంటుందా?

Akkineni Akhil: టాలీవుడ్ అక్కినేని హీరో అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల అయ్యి కనీసం వారం రోజులు కూడా ఆడకముందే థియేటర్ లో నుంచి తీసేసారు. కాగా ఏజెంట్ సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఇంకా ఓటీటీ లోకి రాకపోవడంతో అనేక రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మళ్లీ ఎడిటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు అని తేలిపోయింది. తాజాగా ఏజెంట్ నిర్మాత అనీల్ సుంకర ఈ విషయంపై స్పందిస్తూ ఏజెంట్ మూవీ ని రీ ఎడిట్ లాంటివేం చేయడం లేదు అని స్పష్టం చేశారు. ఓటీటీ కోసం కొత్తగా ఎడిటింగ్ ఎక్కడ్నుంచి చేస్తారు? మేమిచ్చిందే చేయాలి. ఎడిటింగ్ వాళ్లు చేయాలంటే కంటెంట్ మేం ఇవ్వాలి కదా. మేం సినిమా కంటెంట్ మాత్రమే ఇస్తాం. రష్ మొత్తం ఇవ్వం కదా. అలాంటప్పుడు కొత్తగా ఎడిటింగ్ ఏం చేస్తారు వాళ్లు అని ఆ వార్తలపై ఒకింత సహనం వ్యక్తం చేశారు అనిల్ సుంకర.

 

అలాగే ఏజెంట్ సినిమా ఓటీటీలోకి రావడానికి ఎందుకు ఆలస్యమౌతుంది అన్న విషయం తనకు కూడా తెలియదని తెలిపారు అనీల్ సుంకర. సినిమాను తను ఆల్రెడీ అమ్మేశాను కాబట్టి, అది ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనే అంశంతో తనకు సంబంధం లేదని ఆయన అన్నారు. అలాగే ఏజెంట్ సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్లందరినీ వివిధ రూపాల్లో ఆదుకుంటానని హామీ ఇచ్చారు సుంకర. కాగా అనిల్ శంకర చేసిన వాఖ్యలపై పలువురు నెట్టిజెన్స్ స్పందిస్తూ అక్కినేని అఖిల్ కు ఇంతకంటే ఘోర అవమానం మరొకటి ఉండదు. ఏజెంట్ సినిమా ఓటీటీ లోకి విడుదల అయ్యే అవకాశాలు లేనట్టు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -