Sharath Babu: అయ్యో పాపం.. శరత్ బాబు అలాంటి సమస్యతో బాధ పడుతున్నాడా?

Sharath Babu: సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు శరత్ బాబు. ఆయన ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు అధికారిక వర్గాల నుంచి తెలిసింది. కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు ఒక ఇన్ఫెక్షన్ తో కూడా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలిసింది.

ఇటీవల శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు సమీక్షించి, అత్యవసర చికిత్స చేశారు. అయితే మళ్లీ ఇటీవల ఆయన ఆరోగ్యం కొంత క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చేర్పించారు. ఇక శరత్ బాబు మెల్లగా మెరుగుపడుతుందన్న సమయంలో ఇన్ఫెక్షన్ శరీరం మొత్తం వ్యాపించింది.

 

శరత్ బాబు ప్రస్తుతం శరత్ బాబుకు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. 70 ఏళ్ల వయసులో ఉన్న శరత్ బాబు చాలా కాలంగా స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే ఆయన చెన్నైలోనే ఒక ప్రముఖ హాస్పిటల్ లో చాలా కాలం పాటు చికిత్స అందుకున్నారు. అయితే ఇటీవల ఆయన మరోసారి తీవ్రస్థాయిలో అస్వస్థతకు గురి కావడంతో బెంగళూరులో జాయిన్ చేశారు.

 

అయితే హైదరాబాద్ లో అనువైన చికిత్స ఉందన్న కారణంతో అక్కడి నుంచి మళ్లీ హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు శరత్ బాబు వైద్యుల పర్యవేక్షణ లోనే వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కోలుకోవాలని ప్రముఖులు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -