Sreeleela: అయ్యో పాపం.. శ్రీలీలను వాళ్లు అస్సలు వదలడం లేదా?

Sreeleela: టాలీవుడ్ లో ఇప్పుడు కుర్ర హీరోయిన్ల హవా నడుస్తోంది. తాజాగా హీరోయిన్ శ్రీలీల పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అప్పట్లో పెళ్లి సందడి సినిమా విడుదలైనప్పుడు హీరోయిన్లు అయిన దీప్తి భట్నాగర్, రవళి గురించి అందరూ విపరీతంగా మాట్లాడుకున్నారు. ఆ సినిమాలో రొమాన్స్ చూసి చాలా మంది తెగ ఎంజాయ్ చేశారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన పెళ్లి సందడి ఓ సెన్షేషన్ అని చెప్పొచ్చు. ఆ సినిమాలో రాఘ‌వేంద్రుడు దీప్తి భ‌ట్నాగ‌ర్‌తో పాటు ర‌వ‌ళిని కూడా అంతే అందంగా చూపించి ప్రేక్షకులను కనువిందు చేశారు.

 

హీరో శ్రీకాంత్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ లాగా ఆ సినిమా నిలిచిపోయింది. అంతేకాకుండా ఆ సినిమాకి ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. ఆ పెళ్లి సందడి ఎంతటి హిట్ సాధించిందో అంతటి హిట్ లేటెస్ట్ పెళ్లి సందడి సాధించలేకపోయిందని చెప్పాలి. కానీ ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కుర్ర భామ శ్రీలీల మాత్రం ఆడియన్స్‌కి చాలా దగ్గరైంది.

 

పెళ్లిసంద‌డి టైటిల్‌తో శ్రీకాంత్ త‌న‌యుడు హీరోగా వచ్చినా ఈ సినిమా స‌క్సెస్ వెన‌క కేవ‌లం శ్రీలీల మాత్ర‌మే ఉంద‌ని సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకున్నారు. క‌థ‌, క‌థ‌నాల్లో ద‌మ్ములేక‌పోయినా కూడా శ్రీలీల వ‌ల్లే క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అయ్యింద‌ని చాలా మంది డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు చెప్పడం విశేషం. ముఖ్యంగా అప్పట్లో పెళ్లిసంద‌డి సినిమాలో దీప్తి భట్నాగర్ ఎంత ఫ్రెష్‌గా అనిపించిందో అంత ఫ్రెష్‌గా శ్రీలీల ఇప్పుడు అందర్నీ ఊర్రూతలూగించింది. డాన్స్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా ఆమె ఎంతగానో ఆకట్టుకుంది.

 

తాజాగా రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి పెద్ద హిట్ ను కొట్టింది. ఈ సినిమాలో ఆమె లుక్స్, పర్ఫార్మెన్స్ కంటే కూడా హాట్‌గా కనిపించిన విధానం అందర్నీ ఆకట్టుకుంటోంది. హీరోలు కూడా ఆమెను చూసి చాలా ఇంప్రెస్ అయ్యారని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు అందరి కన్ను శ్రీలీల మీదే ఉందని తెలుస్తోంది. దొరికినవారు దొరికినట్టుగా తన డేట్స్ లాక్ చేసుకోవాలని చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -