Taraka Ratna: తారకరత్న చేసిన ఆ పని వల్ల వచ్చిన డబ్బులే అలేఖ్యకు దిక్కా?

Taraka Ratna: నందమూరి తారకరత్న మృతి ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అలేఖ్య రెడ్డి, ముగ్గురు పిల్లలు ఒంటరిగా మిగిలిపోయారు. అత్తగారి ఇంటి నుంచి అలేఖ్య రెడ్డికి పెద్దగా సపోర్టు లేదు. పైగా తారకరత్న వేల కోట్ల ఆస్తి కూడా సంపాదించింది లేదు. ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువే. ఇక చిన్నచితగా బిజినెస్‌లతో వచ్చిన డబ్బుతోనే అలా బతికేవారు. ఇప్పుడు అలేఖ్య కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పని తెలుస్తోంది.

 

 

సుమారు రెండు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు తారకరత్న. ఆయన ఒకేసారి తొమ్మిది సినిమాలకు సైన్‌ చేసి వరల్డ్‌ రికార్డు కూడా నెలకొల్పాడు. కానీ అందులో అన్నీ చిత్రీకరణ పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత హీరోగా కూడా పెద్దగా మెప్పించలేకపోయాడు తారకరత్న. కానీ విలన్‌ క్యారెక్టర్‌లో తనలోని నటుడిని బయటకు తీశాడు. విలన్‌ క్యారెక్టర్‌కు నందీ అవార్డును సైతం తారకరత్న సొంత చేసుకున్నాడు. తనని నిత్యం విమర్శించే వారికి ఆ అవార్డుతోనే సమాధానం చెప్పాడు.

 

 

అయితే సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా డబ్బు సంపాధించింది ఏమీ లేదు. కేవలం తక్కువ రెమ్యూనరేషన్‌ మాత్రమే తీసుకున్నాడని టాక్‌. పైగా ఎవరినీ నొప్పించే మనిషి కాదు. ఇక సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో పలు రకాల వ్యాపారాలు కూడా చేసినట్లు తెలిసింది. ఒకనొక సమయంలో అత్యవసరంగా డబ్బు అవసరం అయితే జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆదుకున్నాడు. ఈ విషయాన్ని ఇండైరెక్టుగా తారకరత్ననే చెప్పాడు. అయితే ఇప్పుడు అలేఖ్య రెడ్డి కుటుంబానికి ఆర్థిక ఒకే ఒక విషయంలో తారకరత్న మేలు చేసి పోయాడు.

 

 

తారకరత్న తన పేరుపై పలు రకాల ఇన్సూరెన్సులు ఉన్నాయి. ఆయన చనిపోవటంతో అవన్నీ ఇప్పుడు క్లైం అవ్వనున్నాయి. వాటి ద్వారా కొంత డబ్బు అలేఖ్యకు చేకూరనుంది. సుమారు ఆరు కోట్ల రూపాయల ఈ ఇన్సూరెన్స్‌ పాలసీల ద్వారా రానుందని తెలిసింది. ఇప్పుడు ఆమెకు ఈ డబ్బే దిక్కని అంటున్నారు. కుటుంబ పోషణ అంతా ఈ డబ్బుతోనే సర్దుకోవాలని పలువురు మాట్లాడుకుంటున్నారు. భర్తపోతే ఎన్ని కష్టాలు ఎదురవుతాయనే దానికి ఇదో ఉదాహరణ అని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -