DSC: డీఎస్సీ ప్రిపెర్ అయ్యే అభ్యర్థులకు అలర్ట్.. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే!

DSC: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఫిబ్రవరి 12వ తేదీ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6100 పోస్టులను భర్తీ చేయనున్నారు. సోమవారం డీఎస్సీ నోటిఫికేషన్ ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఎస్జీటీ 2280,
స్కూల్‌ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్‌ 42 పోస్టులను భర్తీ చేయనున్నారు.

 

ఇక ఈ పోస్టులకు నేడు ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. 22న దరఖాస్తు స్వీకరణకు ఆఖరి తేదీ. మార్చి 5 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక పరీక్షలు రోజుకు రెండు సెషన్స్ నిర్వహించనున్నారు.

ఉదయం 9.30 నుంచి 12 వరకు ఒక సెషన్‌.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండ సెషన్‌ నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు, ఏప్రిల్‌ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ 2న ఫైనల్‌ కీ.. ఏప్రిల్‌ ఏడున డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నారు.

 

ఇక పరీక్షల సిలబస్ విషయానికి వస్తే 2018 సిలబస్ ప్రకారమే పరీక్ష పత్రాలు రాబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం అధికారిక వెబ్సైట్ cse.apgov.in వివరాలు ఉంచారు. జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. రిజర్వ్‌ కేటగిరి అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంచారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -