CM Jagan: సీఎం జగన్ నమ్మకం మాత్రం వాళ్లేనా.. వాళ్లు లెక్కలు మారుస్తారా?

CM Jagan: గెలుపే లక్ష్యం.. దానికి కోసం ఏమైనా చేస్తామన్నట్టు ఉంది వైసీపీ తీరు. వ్యక్తిగత దూషణలు చేస్తాం.. దాడులు చేస్తాం.. వ్యవస్థలను వాడుకుంటామన్నట్టు తయారైంది పరిస్థితి. ఇప్పుడు జగన్ అండ్ కో నమ్మకం వాలంటీర్లే అన్నట్టు ఉంది. ఎందుకంటే.. వాలంటీర్లకు తాయిలాలు, గిఫ్టు పంపీణీ షురూ చేశారు. 20 వేల రూపాయల నగదు, వంట సామాన్లు అందిస్తున్నారు. ఆ తర్వాత మీరే జగనన్న నమ్మకమని చెబుతున్నారు. మీరే వైసీపీని గెలిపించాలని దిశానిర్థేశం చేస్తున్నారు.

 

విజయవాడ పశ్చిమ నుంచి సెంట్రల్‌కు మారిన మాజీ మంత్రి వెల్లంపల్లి తన మనసులో మాటను బయటపెట్టారు. విజయవాడలో వాలంటీర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ముత్యాలంపాడులోని అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆ సమావేశానికి వాలంటీర్లు పెద్ద ఎత్తున హాజరైయ్యారు. మా నమ్మకం మొత్తం మీ మీదే అని ఆయన వారితో చెప్పారు. వైసీపీ గెలుపు మీ చేతిలోనే ఉందని చెప్పకనే చెప్పారు. అయితే.. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలిస్తున్న వాలంటీర్లను అలా ఎలా వాడుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈసీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లో వాడొద్దని చెప్పింది. కానీ, రాజ్యాంగ సంస్థల ఆదేశాలను పెడచెవిన పెట్టడం వైసీపీ ప్రభుత్వానికి జరామామూలే అయింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు మార్చాలని కోర్టులు చేసిన ఆదేశానలు కూడా పెడచెవిన పెట్టారు. అలాంటిది ఈసీ ఆదేశాలను వైసీపీ నేతలు పాటిస్తారా? అని పలువురు చర్చించుకుంటున్నారు. పర్యావసానాలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ముందు అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

గెలుపునకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ, ఒక్కొక్కటి బెడిసి కొడుతూ వస్తోంది. అంతే కాదు మరిన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు లేకుండా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, బోనస్ గా బీజేపీ కూడా టీడీపీతో పొత్తుపెట్టుకుంటోంది. గత ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా ఉన్న వివేకా హత్యకేసు, కోడికత్తి కేసులు ఇప్పుడు వైసీపీ మెడకు వేలాడుతున్నాయి. ఊహించని రీతిలో షర్మిల ఎదుతిరిగింది. ఇవన్నీ వైసీపీ దెబ్బ మీద దెబ్బలుగా మారాయి. పోని పరిపాలన ఏమైనా గొప్పగా చేశారా అంటే.. నవరత్నాల పేరుతో అప్పులు చేసి ప్రజలకు డబ్బులు పంచారు. దీంతో, రాష్ట్రం దివాళ తీసే పరిస్థితి ఏర్పడింది. అభివృద్ది శూన్యంగా మారింది. అందుకే చివరి అస్త్రంగా వాలంటీర్లను వాడుతున్నారు.

 

నువ్వే మా నమ్మకం జగనన్న అని స్టిక్కర్లు అంటించిన వారే.. ఇప్పుడు జగనన్న నమ్మకం వాలంటీర్లే అంటున్నారు. అయితే వాలంటీర్లు ఏమైనా జగన్ కు అనుకూలంగా ఉంటారా అంటే అది కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే.. ఐదేళ్లుగా 5వేల జీతంతో బతుకుతున్నారు. వారి జీవితాల్లో ఎదుగుబొదుగు లేదు. పేరుకే ఉద్యోగం కానీ ఊడిగం చేస్తున్నామనే అభిప్రాయంలో వారున్నారు. కాబట్టి వారెంత వరకు సహకరిస్తారనేది అనుమానమే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -