YCP: వైసీపీ వల్ల అధికారులకు సస్పెన్షన్.. కుట్రదారులకు శిక్ష లేదా?

YCP: ఫలితం ఒకరికి.. పనిష్మెంట్ మరొకిరికి. అవును.. వైసీపీ నాయకులు చేస్తున్న పనులకు అధికారులు బలి అవుతున్నారు. తిరుపతి లోక‌సభ ఉపఎన్నికల్లో ఎపిక్ కార్డుల అక్రమ డౌన్ లోడింగ్, వాటి ఆధారంగా వేల సంఖ్యలో దొంగ ఓట్లను వేయించిన వ్యవహారంలో వైసీపీ నాయకులు, ఆ పార్టీకి లబ్ధి జరిగింది. కానీ, ఆ పాపానికి శిక్షలు అధికారులకు పడుతున్నాయి. అడ్డదారుల్లో గెలవాలి.. అధిక మెజారిటీ సాధించాలని వైసీపీ నేతలే దొంగ ఓట్లు సృష్టించారన్నది అందరికీ తెలిసిందే. అసలు దొంగ ఓటర్ల అవసరం ఎవరికి ఉంటుంది? నాయకులకా? లేకపోతే అధికారుకలా? దొంగ ఓట్లతో చట్టసభలకు వెళ్లేది నాయకులు.. అధికారులు కాదు. కానీ, ఈ వ్యవహారంలో చర్యలు మాత్రం అధికారులపైనే ఉంటున్నాయి. ఈ కుట్రల వెనకున్న సుత్రధారులు ఎవరు అనే అంశాన్ని కూడా బయటకు తీయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. దొంగ ఓట్లతో ప్రత్యక్షంగా అధికారులకు ఎలాంటి ప్రయోజం ఉండదు. ఏ మాత్రం ప్రయోజనం ఉన్నా.. అది నాయకులకే ఉంటుంది.

 

ఉపఎన్నికల సమయంలో ఎవరు పోటీ చేశారు? ఎవరు గెలిచారు? అసలు ఏ మండలంలో దొంగ ఓట్లు తయారు చేశారు? ఆ మండలంలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి అన్న దగ్గర ఈసీ విచారణ మొదలు పెడితే.. ఎవరికి లబ్ధి చేయడానికి ఈ తతంగం నడిచిందో తెలుస్తోంది. కానీ, ఈసీ పైపై చర్యలకే పరిమితం అవుతోంది. ప్రస్తుతం ఉన్న అధికారులపై వేటు పడితే.. తర్వాత వచ్చే అధికారులతో మళ్లీ ఇలాంటి కుట్రలకు పాల్పడే ప్రమాదం ఉంది. కానీ, ఏ నాయకులు అయితే.. ఈ వ్యవహారం నడిపించారో కనిపెట్టి వారిపై చర్యలు తీసుకుంటే.. మరొక నేత ఇలా చేయడానికి భయపడతారు. అలా అని ఈ దొంగ నోట్ల వ్యవహారం వైసీపీ నేతలే నడిపించారనడానికి ఆధారాలు లేవా అంటే.. చాలానే ఉన్నాయి.

దొంగ ఓట్ల వేయించడానికి ఉపఎన్నికకు ముందు రోజు రాత్రి పుంగనూరు, పీలేరు, నగరి ప్రాంతాలతో పాటు తమిళనాడు నుంచి కూడా కొన్ని వేల మందిని తీసుకొని వచ్చారు. వారంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో బస చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికి వెళ్తే.. వారందరినీ వేరు ప్రాంతాలకు తరలించేశారు.

 

ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముందు రోజు నుంచి స్థానికేతరులు నియోజవర్గంలో ఉండకూడదు. కానీ, పోలింగ్ రోజు రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్. బాబు తిరుపతిలో ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలతో వీడియోలు బయటకు వచ్చాయి. వాటి సాయంతో విచారణ చేపట్టవచ్చు. కానీ, ఆ పని చేయలేదు. ఇలా ఉపఎన్నికకు ముందు మూడు రోజుల నుంచి పదుల సంఖ్యలో ఘటనల్లో వైసీపీ నేతలు పట్టుబడ్డారు. కానీ, ఈసీ మాత్రం అధికారులపై చర్యల వరకే పరిమితం అవుతోంది. దీని వలన అంతిమ లబ్ధిదారులను గాలికి వదిలేసినట్టే అవుతోంది.

 

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాల్లో అధికారులపై అక్షింతలు పడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీ రంగులు, అమరావతి రైతులు వ్యవహారంలో ఇలా చాలా విషయాల్లో సంబందిత అధికారులు కోర్టుల చుట్టూ తిరిగారు. స్వయానా ఏపీ డీజీపీకి కూడా హైకోర్టు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. అలా అని వారు చేసిన పనులు ప్రజలకు మంచి చేసినవా? అంటే అది కాదు.. వైసీపీకి మంచి జరిగేలా చేసిన పనులే. అందుకే వారిపై చర్యలు. కాబట్టి అధికారులు కూడా ఓ సారి ఆలోచించడం మంచిది. అంతిమ లబ్ధిదారులు దర్జాగా ఉన్నారు. అధికారులు వేటుకు గురి అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -