Amit Shah: వైరల్ అవుతున్న అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

Amit Shah: ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల బరిలోకి పొత్తులతో దిగిపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తుల విషయం గురించి చర్చలు జరిపారు. జనసేనతో పొత్తు కుదుర్చుకున్న గెలుస్తామా లేదా అన్న అనుమానాలతో చంద్రబాబునాయుడు బిజెపితో కూడా పొత్తు కుదుర్చుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

 

ఈ విధంగా బిజెపితో పొత్తుకోసమే చంద్రబాబునాయుడు తెగ ఆరాటపడుతున్నారు చాలా రోజుల తర్వాత ఎంతో కష్టపడి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడంతో వెంటనే ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు పొత్తు గురించే అతని వద్ద ప్రస్తావని తీసుకువచ్చారని తెలుస్తుంది.

అయితే శనివారం మీడియా సమావేశంలో బిజెపి పార్టీ నేత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పొత్తు విషయం గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికిప్పుడు ఏపీ పార్టీలతో పొత్తు గురించి ఏమి మాట్లాడదలచుకోవడం లేదు అంటూ అమిత్ షా తెలిపారు.

 

అమిత్ షా పొత్తు గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఓ రకంగా చంద్రబాబు నాయుడుకి నిరాశ కలిగించిందని చెప్పాలి. పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలో దిగాలని చంద్రబాబు నాయుడు ఆరాటపడుతూ ఉండగా అమిత్ షా వ్యాఖ్యలు మాత్రం ఆయనలో ఓ రకమైనటువంటి గుబులు భయాన్ని కలిగిస్తున్నాయి అంటూ పలువురు అమిత్ షా వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. ఉత్తరాదిలో ఎంతో పట్టు ఉన్నటువంటి బిజెపి పార్టీ దక్షిణాదిలో స్థానికంగా ఏ పార్టీకి మంచి గ్రిప్ ఉందో ఆ పార్టీతో కలిసి వెళ్లడానికే ఇష్టత చూపుతున్నట్టు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -