Chandrababu: 1,50,000 పోస్టులతో మెగా డీఎస్సీ.. చంద్రబాబు గెలవాలంటే ఈ ఒక్క హామీ చాలా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. వైసీపీ వై నాట్ కుప్పం అంటే.. చంద్రబాబు మాత్రం వై నాట్ పులివెందుల అంటున్నారు. జగన్‌ను కూడా పులివెందులలో ఓడిస్తానని ఆయన చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే.. పార్టీ భవిష్యత్ అనుమానాస్పదం అవుతుంది. కాబట్టి.. చంద్రబాబు వైసీపీకి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై యువత, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు 90 శాతానికి పైగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది స్పష్టంగా తెలిసింది. దీంతో.. వారికి మరింత దగ్గర చేర్చుకోవడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సీఎం తన మొదటి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై పెడతానని ఆయన ప్రకటించారు. ఇది చాలా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది.

ఎందుకంటే.. సీఎంగా మొదటి సంతకం అనే మాటకు చాలా సార్లు జనాలు ప్రభావితం అయ్యారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా తొలిసంతకం ఉచిత విద్యుత్ పై పెట్టి అమలు చేశారు. ఇక రేవంత్ రెడ్డి సీఎంగా తొలి సంతకం ఆరు గ్యారెంటీల ఫైలుపై పెట్టి అమలు చేశారు. తొలి సంతకం అనే మాట ప్రజలను ప్రభావితం చేస్తుంది. అంతే స్థాయిలో హామీ ఇచ్చిన నాయకులకు తన బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే ఎక్కువ మంది ఆ మాటకు కనెక్ట్ అవుతారు. అలా అని చంద్రబాబు ఏ సంక్షేమ పథకం గురించో చెప్పలేదు. ఉద్యోగ కల్పన గురించి చెప్పారు. పైగా మెగా డీఎస్సీ అన్నారు. కాబట్టి దీంతో చాలా ఎక్కవ మంది కనెక్ట్ అవుతారు. లక్షల మంది నిరుద్యోగులే కాదు.. వారి కుటుంబ సభ్యలు కూడా కనెక్ట్ అవుతారు. చంద్రబాబు చెప్పినట్టు మెగా డీఎస్సీ నోటిఫికేష్ తీస్తే కనీసం 10 లక్షల మంది అయినా అప్లై చేస్తారు. ఒక్కో ఇంట్లో నాలుగురు లెక్క వేసుకున్నా.. 40 లక్షల మంది ఓటర్లను ఒకే దెబ్బతో చంద్రబాబు ఆకర్షించారనే చెప్పాలి. పైగా తొలి సంతకం అన్నారు. తొలి సంతకం అని చెప్పి వదిలేయలేదు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే నోటిఫికేషన్ ఉంటుందని అన్నారు.

అంతేకాదు.. యువత అంతా కలిసి ఎన్నికల సంఘాన్ని కలసి… ప్రస్తుతం రిలీజ్ చేసిన డీఎస్సీ వద్దని కోరాలని సూచించారు. తాము కూడా ఈసీని కలసి డీఎస్సీ పై మాట్లాడుతామని అన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుదని అన్నారు. గతంలో లక్షా 50 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని గుర్తు చేశారు. దానికి మించి ఈసారి నోటిఫికేషన్ ఉంటుందని హామీ ఇచ్చారు. నిజంగా లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే.. ప్రజల సామాజిక, ఆర్ధిక స్థాయి పెరిగినట్టే. అది రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా లాభం జరిగినట్టే. ఇక.. ప్రభుత్వ ఉద్యోగులకు అంతంత జీతాలు ఇచ్చి ఎలా పని చేయించుకోవాలో చంద్రబాబు ఎలాగూ తెలుసుకనుక ఫలితం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు.

గత ఎన్నికల్లో జగన్ మెగా డీఎస్సీ పేరుతో మోసం చేశారు. ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు తప్పులు, తడకలతో ఓ నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి జగన్ ఉద్యోగాల కల్పన గురించి, అభివృద్ధి గురించి హామీలు ఇచ్చినా.. ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు ఒకే ఒక్క హామీతో యువతను తన వైపు తిప్పుకున్నారు. ఇప్పటికే అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రకటించి అన్ని వర్గాలకు దగ్గర అయ్యారు. ఇప్పుడు యువతకు కూడా ఓ భరోసా ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -