Telangana: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇకపై రాష్ట్రం పేరు ఇలా ఉండబోతుందా?

Telangana: తెలంగాణలో ప్రభుత్వం మారడంతో ప్రతిదీ మారిపోతుంది. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను పేరు మార్చేసి అమలుపరచడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధపడింది. ఇప్పుడు తెలంగాణ నెంబర్ ప్లేట్లపై ఉండే టీఎస్ అనే అక్షరాలను మార్చేసి టీజీ అని మార్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించుకుంది. ఈ మేరకు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ అని వచ్చేలా టీఎస్ అని షార్ట్ ఫామ్ ని ప్రభుత్వం రిజిస్టర్ చేయించింది. కేవలం నెంబర్ ప్లేట్ల పైనే కాకుండా అన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా తెలంగాణ స్టేట్ అని వచ్చేలా పేర్లు మారిపోయాయి. అయితే ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మార్చాలని నిర్ణయించింది. టీఎస్ అనే షార్ట్ ఫామ్ ని ఇప్పుడు టీజీ గా మార్చాలని నిర్ణయం తీసుకుంది.

క్యాబినెట్ కూడా ఇందుకు ఆమోదించింది. తాము అధికారంలోకి రాగానే జయజయ హే తెలంగాణ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటిస్తామని టీఆర్ఎస్ నే పోలి ఉన్నట్లుగా వాహనాల రిజిస్టర్ కోసం టీఎస్ అని తీసుకొచ్చారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాన్ని సవరించి టీజీ చేస్తామని కూడా ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదనలపై తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న వారిలో సానుకూలత వ్యక్తం అయింది.

 

కాంగ్రెస్కు అధికారం రావటంతో ఆ హామీ మేరకు తెలంగాణ కోడ్ టీఎస్ పేరును టీజీగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు టీఎస్ కాస్త టీజీగా మారితే మాత్రం కేవలం నెంబర్ ప్లేట్లు మాత్రమే కాదు చాలా మార్చాల్సి వస్తుంది. మరి కేవలం నెంబర్ ప్లేట్లు మీదే మారుస్తారా లేదా మొత్తం మారుస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ నిర్ణయం పై ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

Election Commission: పింఛన్ల పంపిణీలో ఈసీ కీలక ఆదేశాలు.. జగన్ సర్కార్ కు ఇక చుక్కలేగా!

Election Commission: ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది అయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే తీసుకువెళ్లారు అయితే...
- Advertisement -
- Advertisement -