Revanth: రేవంత్ విమర్శల విషయంలో వైసీపీ నేతలు రియాక్ట్ అవుతారా?

Revanth: వైసీపీ నేతలు మౌనం వహిస్తున్నారు. విమర్శలపై స్పందించడం లేదు. వైసీపీ నేతలు మౌనమా? అనే అనుమానం రావొచ్చు. కానీ అది నిజంగానే జరుగుతోంది. మరి వ్యూహాత్మకమా? తప్పును ఒప్పుకుంటున్నారో తెలియదు కానీ.. మౌనమే సమాధానం అవుతోంది. అసలు విషయం ఏంటీ అంటే.. సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ, వైసీపీ మంత్రులు కానీ, సజ్జల రామకృష్ణరెడ్డి కానీ స్పందించడం లేదు.

 

సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను కార్నర్ చేయడానికి ఏపీ ప్రభుత్వాన్ని, అక్కడి మంత్రులను వాడుకుంటున్నారు. కేసీఆర్ ఏపీ ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అసెంబ్లీ సాక్షిగా విమర్శలు చేస్తున్నారు. పనిలో పనిగా ఏపీ మంత్రి రోజా పెట్టిన రొయ్యిల పులుసుకి సీఎం రేవంత్ రెడ్డి పడిపోయాడని.. తెలంగాణ నీళ్లను ఏపీకి వదిలేశాడని విమర్శలు చేశారు. రాగి సంగడి, రొయ్యిల పులుసు తిని మంత్రి రోజాను ఆశీర్వదించారని అన్నారు. అంతేకాదు.. అప్పుడే రాయలసీమను రతనాల సీమ చేస్తనని మాటిచ్చారని రేవంత్ గుర్తు చేశారు. రోజా ఆతిద్యానికి కేసీఆర్ తెలంగాణ నీళ్లు ఏపీకి వదిలేశాడని ద్వజమెత్తారు.

అయితే, దీనిపై రోజాకానీ ఏపీ మంత్రులు కానీ అసలు స్పందించలేదు. ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు రొయ్యిల పులుసు పెట్టి నీళ్లు తెచ్చుకోవాల్సిన కర్మ మాకు లేదు.. నాగార్జున సాగర్‌లో మాకు కూడా వాటా ఉందని ఎందుకు ఏపీ మంత్రులు ప్రశ్నించలేకపోతున్నారో తెలియడం లేదు. ఏపీ హక్కులన దర్జాగా కాపాడుకుంటామని.. దాని కోసం రొయ్యిల పులుసు పెట్టాల్సిన పని లేదని గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దొంగలా నీళ్లు దోచుకున్నామనే మెసెజ్ వెళ్తుంది.

 

అంతేకాదు… గత కొన్ని రోజులుగా డైరెక్ట్‌గా ఏపీ సీఎం జగన్‌ను కూడా రేవంత్ టార్గెట్ చేస్తున్నారు. ఏకే 47 గన్నులతో ఏపీ పోలీసులు వచ్చి తెలంగాణ నీళ్లను ఏపీకి విడుదల చేశారని మండిపడుతున్నారు. దీనికి కేసీఆర్ ఇచ్చిన అలుసే కారణమని ద్వజమెత్తారు. దొంగల్లా వచ్చి నీళ్లు తీసుకుపోతుంటే.. కేసీఆర్ మౌనం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ వారం రోజులుగా రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దీనిపై ఏపీ నుంచి ఒకరు కూడా స్పందించలేదు. దొంగలా నీళ్లు తీసుకెళ్లాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ మంత్రులు చెప్పాలి. హక్కుగా ఏపీకి రావాల్సిన నీళ్లనే తీసుకున్నామని రెస్పాండ్ అవ్వాలి. కానీ, ఇంతవరకూ ఒకరూ కూడా స్పందించలేదు. అలా అని మౌనం వైసీపీ లక్షణం కాదు. ప్రతిపక్షాలపై వైసీపీ నేతలు ఏ విధంగా రెచ్చిపోతారో చూస్తూనే ఉన్నాం. కానీ, వారం రోజులుగా రేవంత్ రెడ్డి ఇవే కామెంట్స్ తిప్పి తిప్పి చేస్తున్న మౌనంగా ఉంటున్నారు.

 

అయితే, దీనికి కారణం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కావాలనే మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డిపై సీరియస్ అయితే.. ఏపీ ఎన్నికల్లో తమకు నష్టం జరుగుతుందని ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నారట. రేవంత్ రెడ్డికి కోపం వచ్చేలా ఏమైనా కామెంట్స్ చేస్తే.. హైద్రాబాద్‌లో వైసీపీ నేతల ఆర్థిక మూలాలను తెలంగాణ సర్కార్ టార్గెట్ చేస్తుందని భయపడుతున్నారట. ఎన్నికల సమయంలో హైద్రాబాద్ నుంచి మనీ ఫ్లో ఆగిపోతే చాలా ప్రమాదమని భావిస్తున్నారనట. అందుకే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని తెలుస్తోంది.

 

ఇప్పటికే రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ వైసీపీకి పెద్ద డ్యామేజ్ చేశాయి. విజయసాయి రెడ్డి కామెంట్స్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గట్టిగా రెస్పాండ్ అయ్యారు. అంతేకాదు.. వారి ఆర్థిక మూలాలు కూడా టార్గెట్ చేస్తారని తెలుస్తోంది. మళ్లీ ఇంతలో ఇంకో లొల్లి అవసరం లేదని వైసీపీ మౌనంగా ఉంటుదని టాక్

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -