Telangana: తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్, కరెంట్ స్కీమ్స్ ఆరోజు నుంచి అమలవుతాయా?

Telangana: తెలంగాణలో ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలను ప్రకటించక సంగతి మనకు తెలిసిందే తాము అధికారంలోకి వస్తే ఈ పథకాలను తెలంగాణ ప్రజలకు ఉచితంగా ఇస్తామంటూ ఈయన 6 పథకాలను ప్రకటించారు. ఇందులో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అలాగే కరెంటు కూడా ఒకటే అని చెప్పాలి. అయితే త్వరలోనే ఈ రెండు పథకాలను అమలు పరచటానికి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని తెలుస్తోంది.

500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అదేవిధంగా 200 యూనిట్ల లోపు కరెంట్ కాల్చిన వారికి ఉచితంగా కరెంటు సౌకర్యాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలలో ఈ విషయాలను ప్రకటించింది. అయితే ఈ రెండు పథకాలను ప్రజలకు ఇవ్వటానికి ముహూర్తం ఖరారు అయింది ఫిబ్రవరి 27వ తేదీ ఈ పథకాలను ప్రజలకు అందించబోతున్నారు.

ఈ పథకాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ రాబోతున్నారని తెలుస్తుంది. శుక్రవారం వన దేవతలు అయినటువంటి సమ్మక్క సారక్కలను దర్శించుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఈ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండాలని తాను మన దేవతలను కోరుకున్నానని తెలిపారు.

మేడారం సమ్మక్క జాతరలను ఎంతో ఘనంగా నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వం 110 కోట్ల రూపాయలను విడుదల చేశారు అయితే ఈ జాతరను జాతీయ పండుగ నిర్వహించాలంటూ ఈయన డిమాండ్ చేశారు. కేంద్రం కుంభమేళాను జాతీయ పండుగగా నిర్వహించినప్పుడు సమ్మక్క సారక్కల జాతరను ఎందుకు జాతీయ పండుగగా నిర్వహించదని తెలిపారు. అయోధ్య బాల రాముడిని నరేంద్ర మోడీ అమిత్ షా దర్శించుకున్నట్టే సమ్మక్క సారక్కలను కూడా దర్శించుకోవాలంటూ ఈయన తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -