Ali: పవన్ గురించి అలీ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

Ali: చిత్ర పరిశ్రమలో చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ కూడా ఉన్నారు. వీరు గొప్ప స్నేహితులుగా బాగా తెలుసు. అయితే పవన్, అలీకి మధ్య అప్పుడు ఉన్న స్నేహం ఇప్పుడు మాత్రం లేదు. అందుకు రాజకీయమే కారణం అని తెలుస్తోంది. వారిద్దరి మధ్య రాజకీయం చిచ్చుపెట్టిందని తెలుస్తోంది. నిజానికి అలీకి పవన్ కళ్యాణ్ చాలా సాయం చేశాడు. ఆ విషయంలో ఎవ్వరూ తప్పుబట్టలేరు.

 

పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తున్నాయంటే అలీ తప్పకుండా ఉండేవాడు. ఒకానొక సమయంలో అలీ తన గుండెకాయ అని బహిరంగంగానే పవన్ కళ్యాణ్ చెప్పాడు. అంత గొప్పగా వారు స్నేహం చేశారు. అయితే వారు రాజకీయాల్లోకి వచ్చేసరికి విడిపోవాల్సి వచ్చింది. అలీ వైసీపీలో చేరారు. పవన్ మాత్రం జనసేన పార్టీని పెట్టి ప్రజల్లోకి వెళ్లారు.

 

పవన్ కు దూరం అయినప్పటి నుంచి అలీని పవన్‌ అభిమానులు అంతగా పట్టించుకోవడం లేదని చెప్పొచ్చు. అలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవన్‌ కల్యాణ్ అంటే తనకు చాలా అభిమానం, ఇష్టం ఉన్నాయని, కానీ ఓటు మాత్రం ఆయనకు వేయనని తెలిపాడు. కచ్చితంగా జగన్‌కే వేస్తాను అంటూ అలీ తెలిపారు.

 

గత ఎన్నికల్లో వైసీపీ అనుసరించిన వ్యూహం ఇదే అని చెప్పొచ్చు. పవన్‌ ను అభిమానిస్తాం కానీ జగన్‌కే ఓటు వేస్తాం అంటూ అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అలీ కూడా అదే నినాదాన్ని మరోసారి వినిపించంతో అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అలీ ఓటే వేయడం, వేయకపోవడం అనేది ఆయన వ్యక్తిగత విషయం అని కొందరు అభిప్రాయపడుతుంటే మరికొందరు అలీ చేసేది తప్పంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -