Andhra Pradesh: మళ్లీ మూడు రాజధానులు, మహా పాదయాత్ర.. ఏపీలో హైటెన్షన్

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనేలా కనిపిస్తున్నాయి. కారణం మళ్లీ మూడు రాజధానుల బిల్లును వైసీసీ సర్కార్ తీసుకురానుండటమే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పరోక్షంగా మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. రాజధానుల వీకేంద్రీకరణే తమ ప్రభుత్వ ధ్యేయమని వ్యాఖ్యానించారు. దీంతో మూడు రాజధానుల నిర్ణయానికే జగన్ కట్టుబడి ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మంత్రులు, వైసీపీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. త్వరలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతారంటూ తెలుపుతున్నారు.

ఇటీవల విజయసాయిరెడ్డి, కొడాలి నానితో పాటు పలువురు నేతలు విశాఖకు సీఎం జగన్ మకాం మారుస్తారని, అక్కడ నుంచి మకాం మారుస్తారని బహిరంగంగా వెల్లడించారు. దీంతో ఈ నెల 15 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ ప్రవేశపెట్టడం ఖాయమంగా కనిపిస్తోంది. వచ్చే నెలలో దసరా కూడా ఉండటంతో అప్పటిలోగా మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేయాలని జగన్ సర్కార్ చూస్తోన్నట్లు సమాచారం. ఈ నెలలో అసెంబ్లీ ఆమోదం లభించి తర్వాత వచ్చే నెలలో దసరా రోజును విశాఖకు జగన్ మాకాం మార్చి అక్కడ నుంచే పాలన కొనసాగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే విశాఖనే ప్రధాన రాజధాని అని వైసీపీ నేతలు ఫిక్స్ అయిపోయారు. అక్కడే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు అధికారికంగా విశాఖను రాజధానిగా చేయాలని సర్కార్ ప్రయత్నిస్తోంది. అయితే వైసీసీ సర్కార్ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టనున్న క్రమంలో అమరావతి రైతుల ఉద్యమం మళ్లీ ఉధృతమైంది. ఈ నెల 12 నుంచి మహా పాదయాత్రకు రైతులు శ్రీకారం చుట్టారు. అమరావతి రైతుల పాదయాత్రకు రాష్ట్ర డీజీపీ అఅనుమతి నిరాకరిస్తూ నోటీసులు జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలో హైకోర్టులో అమరావతి రైతులకు ఊరట లభించింది. అమరావతి రైతలు పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రభుత్వానికి షాక్ తగిలినట్లు అయింది. అమరావతి నుంచి అరసవెల్లి వరకు రైతులు పాదయాత్ర చేపట్టనున్నారు. అమరావతి పాదయాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా సాగనుంది. దీంతో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు రైతుల పాదయాత్రను ఖండిస్తున్నారు. పాదయాత్రను ప్రజలే అడ్డుకుంటారని హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు జరిగే అవకాశముంది.

అసెంబ్లీ సమావేశాల సమయంలోనే అమరావతి రైతుల పాదయాత్ర సాగుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. గతంలో మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం తీసుకురాగా.. హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానుల బిల్లు చెల్లదని తీర్పునిచ్చింది. అందుకే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. ఈ సారి కొన్ని మార్పులు చేసి మూడు రాజధానుల బిల్లులను తీసుకురానుంది. సాంకేతికంగా, న్యాయపరంగా ఎలాంటి చిక్కులు తలెత్తకుండా మూడు రాజధానలు బిల్లును తీసుకురానుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మూడు రాజధానుల బిల్లను ప్రవేశపెడతామని ప్రభుత్వం అంటోంది.

దీంతో ఈ నెలలో ఏపీ రాజకీయాలు హీటెక్కనున్నాయి. మూడు రాజధానులకు కేంద్రంలోని బీజేపీ కూడా సహకరించడం లేదు. ప్రతిపక్షాలు మళ్లీ ఆందోళన చేపట్టే అవకాశముంది. అమరావతి రైతులు మళ్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది. మూడు రాజధానుల బిల్లుపై స్టే ఇవ్వాలని కోరే అవకాశముంది. దీంతో రానున్న రోజుల్లో మూడు రాజధానుల అంశంపై ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -